పోషకాహార లోపంతో బాధ‌ప‌డుతోన్న‌ చిన్నారులు తప్పక తీసుకోవాల్సిన ఆహారం ఇదే..!

ఇటీవల కాలంలో చిన్నారులు, మహిళలు ఇలా చాలామంది సాధారణంగా ఎదుర్కొంటున్న సమస్య. పౌష్టికాహార లోపం ఉన్న వారు తరచుగా జబ్బు పడడం, వయసుకు తగ్గ బ‌రువు మరియు పొడవు ఉండకపోవడం, బలహీనంగా ఉండడం, ఎల్లప్పుడూ నీరసంగా, చిరాకుగా ఉండడం ఇలాంటి లక్షణాలను కలిగి ఉంటారు.

ఇలా పౌష్టిక ఆహార లోపం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని పౌష్టికాహారి లోపం రాకుండా ఉండాలంటే కచ్చితంగా కొన్ని ఆహార పదార్థాలను రోజు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ప్రతిరోజు తినే ఆహారంలో మాంసకృతులు సరిపడగా ఉండడానికి గుడ్లు, ప‌ప్పు ఫిష్ , చికెన్, బీన్స్ వీటిలో ఏదో ఒక దాన్ని మన రోజు భోజనంలో చేర్చుకోవాల్సి ఉంటుంది.

ఎక్కువ క్యాలరీస్ ఉండే విధంగా చిక్కని పాలు, వెన్న, చీజ్, నెయ్యి లాంటి వాటిని తరచుగా ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే మన ఆహారంలో ఐరన్, విటమిన్ ఏ, జింక్ వంటి పోషకాల లోటును భర్తీ చేసే విధంగా ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల పౌష్టికాహారపు లోపం తగ్గి పిల్లలు పెద్దలు ఎవరైనా ఆరోగ్యంగా ఉంటారు.