డెంగ్యూ ఫీవర్ ఉంటే తినాల్సిన ఆహారం ఇదే..!

వర్షాకాలం సీజన్ వచ్చిందంటే విష జ్ంరాలు విజృంభిస్తాయి. ఎక్కడ చూసిన డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లాంటి జ్వరాలతో హాస్పిటల్స్ లో చేరుతు ఉండేవారి సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో డెంగ్యూ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధార‌ణ‌ జ్వరం లాగే వచ్చే ఈ ఫీవర్ లక్షణాలు త్వరగా బయటపడ‌వు. ఆరోగ్యంగానే కనిపిస్తారు కానీ రోజులు గడిచే కొద్ది వారిలో డెంగ్యూ లక్షణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటాయి. సరైన సమయంలో చికిత్స తీసుకుంటేనే ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు. ఇంతకీ డెంగ్యూ లక్షణాలు ఏంటి తీసుకోవాల్సిన ఆహారం ఏంటి తెలుసుకుందాం.

డెంగ్యూ లక్షణాలు :
డెంగ్యూ దోమల వల్ల వస్తుంది ఏది చెప్తే అదే ఆడదోమల కారణంగా వ్యాప్తిస్తుంది. పగలు కుట్టే దోమలతోనే ఈ వ్యాధి సంక్రమిస్తుంది. దీని వల్ల రోగనిరోధక శక్తిపై ప్రభావం పడుతుంది. క్రమంగా వైరస్ తీవ్రత ఎక్కువే జ్వరం పెరిగిపోతుంది. దీంతో పాటు ఇతర లక్షణాలు కూడా మనకి కనిపిస్తాయి. డెంగ్యూ వచ్చిన వారికి 140 ఫారం హిట్స్ డిగ్రీల జ్వరం ఉంటుంది. అలాగే తలనొప్పి, కండరాలు, ఎముకలు, కీళ్ల నొప్పులు బాగా కనిపిస్తూ ఉంటాయి. వికారం, వాంతులు మరో ప్రధాన లక్షణం. కళ్ళుమండటం, వికారం, తీవ్రమైన కడుపునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, విసుగు ఈ జ్వరం లక్షణాలు.

డెంగ్యూ జ్వరం ఉంటే శరీరంలో ప్లేట్లెట్స్ కౌంట్ కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. డెంగ్యు జ్వరానికి నిర్దిష్టమైన చికిత్స లేదు. కాబట్టి ఈ లక్షణాలు ఎప్పటికప్పుడు చికిత్స చేయించుకుంటే మంచిది. ప్లేట్లెట్ సంఖ్య 20వేల కంటే పడిపోతే ప్రమాదకర స్థాయిలో ఉన్నామని.. ఈ పరిస్థితుల్లో తక్షణం ప్లేట్లెట్స్ ఎక్కించుకోవలసి వస్తుంది. కనుక పై ఉండే డెంగ్యూ లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే చికిత్స చేయించుకోవడం మంచిది.

డెంగ్యూ జ్వరానికి తీసుకోవాల్సిన ఆహారం:
డెంగ్యూ వచ్చిన సులువుగా జీరణమ‌యే ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా పండ్ల రసాలు ఎక్కువగా తాగాలి. బొప్పాయి పండ్లు లేదా మొక్క ఆకులు రసాన్ని స్వల్ప మొత్తంలో తీసుకోవడం వల్ల రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది. ఆరెంజ్ జ్యూస్‌ రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. శరీరాని డిహైడ్రేట్ కాకుండా సహాయపడుతుంది. డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడంలో కొబ్బరి నీళ్లు ప్రాముఖ్యత వహిస్తాయి. డెంగ్యూ జ్వరం అటాక్‌ చేస్తే శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది.

అందుకే కొబ్బరి నీళ్ళని ఎక్కువగా తీసుకుంటే బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. ఇందులో ఖనిజాలు, ఎలక్ట్రో లైట్లు అధికంగా ఉంటాయి. అలాగే ప్రతిరోజు ఒక కివీ పండును తినడం వల్ల ప్లేట్ లెట్స్ అంకె పెరుగుతుంది. కీవి జ్యూస్ తాగిన మంచి ఫలితం ఉంటుంది. పాలకూరలో విటమిన్ ఈ ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే పాలకూరలో పోషకాలు డెంగ్యూ జ్వరాన్ని నివారించడానికి సహాయపడతాయి. వీట్‌ గ్రాస్‌ డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది. దాని కారణంగా జ్వరం కూడా తగ్గుతుంది.