షకీలాని ముద్దులతో ముంచేత్తిన టేస్టీ తేజ.. మరీ అంతలానా..

బిగ్ బాస్ హౌస్ లో నిన్న జరిగిన సండే ఎపిసోడ్ ని ఫన్ డే అంటూ ప్రారంభించాడు నాగార్జున . కానీ, ఆడియన్స్ అందరికీ అది బోరింగ్ డేలా అనిపించింది. ఎందుకంటే, ఎలిమినేషన్ లో కిక్ అనేది ఉండదు. అంతేకాదు, చాలామంది ముందుగానే సోషల్ మీడియా ద్వారా ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది తెలుసుకుంటున్నారు. బిగ్ బాస్ లవర్స్ అయితే శనివారం రాత్రే ఈవిషయాన్ని షూటింగ్ అవ్వగానే పట్టేస్తున్నారు. అందుకే, బిగ్ బాస్ టీమ్ ఎలిమినేషన్ రౌండ్ ని లైవ్ లో టెలికాస్ట్ చేస్తే బాగుంటుదని చాలామంది సలహాలు ఇస్తున్నారు. ఈవిషయం పక్కనబెడితే, 2వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి షకీల ఎలిమినేట్ అయిపోయింది.

ఈ ఎలిమినేషన్ ప్రక్రియ లో చివరివరకు టేస్టీ తేజ, షకీలా ఉన్నారు. వారిద్దరిని బిగ్ బాస్ యాక్టివిటీ రూమ్ లో మాయాస్త్రం వచ్చిన ప్లేస్ లో ఒకరి ఫోటో వస్తుంది అని చెప్తాడు . అందులో టేస్టీ తేజ ఫోటో వచ్చేసరికి తేజ సేఫ్ అయ్యాడు. షకీల ఎలిమినేట్ అయ్యిందని నాగార్జున చెప్పాడు. దీంతో తేజ తను సేవ్ అయ్యాడు అని ఆనంధపడకుండా షకీలా ఎలిమినేట్ అయింది అని అక్కడిక్కడే కన్నీళ్లు పెట్టేసుకున్నాడు. అంతేకాదు, షకీలమ్మ నాకు ఎప్పటికీ అమ్మగానే ఉంటుందని, హౌస్ లో నాకు అమ్మలేని లోటుని పూర్తి చేసిందని తేజ చెప్పాడు.

అలాగే, షకీలమ్మ హౌస్ నుండి వెళ్లిపోతుంటే అమర్ , సందీప్, శోభా ఆమెని గట్టిగ పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు తేజ, షకీలా ని గట్టిగ కౌగిలించుకొని ముందుపెట్టుకొని వెక్కివెక్కి ఏడ్చాడు. షకీలా ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ మొత్తం బాధాకర వాతావరణం నెలకొంది. ఆ తరువాత షకీలకి హౌస్ మేట్స్ అందరూ సెండ్ హాఫ్ ఇచ్చారు. స్టేజ్ పైకి వచ్చిన షకీల తన జెర్నీని చూసి కన్నీళ్లు పెట్టుకుంది.  మొత్తానికి షకీల సీజన్ 7 లో మెరుపులా వచ్చి మాయ చేసి హౌస్ లో ఉన్న వల్ల మనసులే కాకుండా, ఆడియన్స్ మనసులు కూడా గెలుచుకుందనే చెప్పాలి.