హీరోల నిర్లక్ష్యం వల్ల.. మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు ఇవే….!!

ఒక సినిమా తీయాలంటే ఆ సినిమా దర్శకుడు ఆ సినిమాని ఎలా తీయాలి.. ఎవరితో తీయాలి అనేది ముందుగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకసారి ఒక హీరోతో కమిట్ అయ్యి ముందుకు దిగిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ సినిమాను.. ఆ షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయాలి. ఆ సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనే విషయం పక్కన పెడితే డైరెక్టర్ బాధ్యత ఏంటంటే.. షూటింగ్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి రిలీజ్ చేయడం మాత్రమే.. కొంతమంది డైరెక్టర్లు కొన్ని సినిమాలను స్టార్ట్ చేసి తరువాత హీరోల నుంచి గానీ, ప్రొడ్యూసర్ల నుంచి గాని ఎదుర్కొని ఇబ్బందుల వల్ల ఆ సినిమాను మధ్యలోనే ఆపేసి ఇంకో హీరోతో చేస్తూ ఉంటారు.

అలా ఓవర్ బడ్జెట్ వెల్లగాని, హీరోల బిహేవియర్ వల్లగాని ఆగిపోయిన సినిమాలు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. రామ్ చరణ్ హీరోగా ” మెరుపు “అనే ఒక సినిమా స్టార్ట్ చేశారు. మగధీర సినిమా తర్వాత రామ్ చరణ్ – కాజల్ కాంబినేషన్లో రావ‌ల‌సిన‌ సినిమా ఇది.. అయితే ఈ సినిమా మొదట అనుకున్నప్పుడు బడ్జెట్ చాలా తక్కువగా అనుకున్నారు.. కానీ అది రోజు రోజుకి పెరుగుతూ ఉండడంతో బడ్జెట్ నీ కంట్రోల్ చేయలేక పోయారు. ఇక అప్పుడే రిలీజ్ అయిన ఆరెంజ్ సినిమా ఓవర్ బడ్జెట్ వల్ల ఫ్లాప్ అయినా విషయం తెలుసుకున్న చిరంజీవి మెరుపు సినిమాకి ఓవర్ బడ్జెట్ అవుతుంది అని చెప్పి ఆ సినిమాని మధ్యలోనే ఆపించేశారు.

అలా ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇక‌ మంచు మనోజ్ హీరోగా చేయాల్సిన ఒక సినిమా ఆయన చేతుల మీదగా ఆయనే మిస్ చేసుకున్నారు. ఆయన రోజు రోజుకి లేట్ చేయడం వల్ల ఆ సినిమా డైరెక్టర్ ఆయనతో వేగలేక మెగా హీరో అయినా వైష్ణవ్ తేజ్ తో సినిమాని తీశారు. ఆ సినిమానే ” ఆదికేశవ “. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. తొందరలోనే ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇలా ఇండస్ట్రీలో ఉన్న కొన్ని సినిమాలు హీరోల బిహేవియర్ వల్ల గాని.. ఓవర్ బడ్జెట్ వల్ల గాని మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చాయి.