నాగచైతన్య-కీర్తి సురేష్ కాంబో లో మిస్ అయిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో సెట్ అయినట్లే సెట్ అయ్యి లాస్ట్ మూమెంట్లు మిస్ అవుతూ ఉంటాయి. అలాంటి ఓ క్రేజీ కాంబోనే నాగచైతన్య కీర్తి సురేష్ ల జంట . సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఈ జంట ఫుల్ లెంత్ కలిసి తెరపై కనిపించింది లేదు ..నటించింది లేదు. కానీ వీళ్ళ కాంబోలో ఓ సినిమా రావాల్సి వుండింది .అది మిస్ అయిపోయింది . ఆ సినిమా మరేదో కాదు మజిలీ .

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత నాగచైతన్య హీరో హీరోయిన్లుగా నటించారు . దివ్యంక కౌశిక్ మరో హీరోయిన్గా నటించింది . అయితే సమంత పాత్రలో ముందుగా కీర్తి సురేష్ ని చూస్ చేసుకున్నారట మేకర్స్ . అయితే రియల్ వైఫ్ అయితే ఈ పాత్రకు మరింత బాగా సెట్ అవుతుంది అని చెప్పడంతో డైరెక్టర్ శివనిర్వాణ.. సమంతను అప్రోచ్ చేయి మరి ఈ సినిమాను ఫైనలైజ్ చేశారట.

ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే . కానీ ఏం లాభం వాళ్ళు మాత్రం ఇప్పుడు కలిసి లేరు . విడాకులు తీసుకొని ఎవరి దారి వారిది అన్నట్టు బ్రతికేస్తున్నారు. కాగా అప్పుడు మిస్ అయిన ఈ కాంబో ఇప్పుడు సెట్ అయింది . చందు ముండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ – సాయి పల్లవి నటిస్తున్నారు అంటూ తెలుస్తుంది..!!