చిరంజీవిని చంపాలి అని ప్లాన్ చేసిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..? ఎలా తప్పించుకున్నాడంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి స్థానం ఉందో మనకు బాగా తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా నలుగురు హీరోలు ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీకి వచ్చేలా తన స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు చిరంజీవి ఎటువంటి సపోర్ట్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే పెద్ద గొప్ప విషయం అనుకునే రోజుల్లో.. వచ్చి సొంత టాలెంట్ తో పైకి ఎదిగి స్టార్ నుండి మెగాస్టార్ గా మారి సినీ ఇండస్ట్రీలోనే మకుటం లేని మహారాజుగా మారిపోయాడు మెగాస్టార్ .

అలాంటి టైం లోనే ఓ స్టార్ హీరోకీ ఆయనను చూసి కుళ్ళు పుట్టింది .. నన్ను మించిన హీరో అయిపోతున్నాడు అని తెలిసి మెగాస్టార్ చిరంజీవి పై పర్సనల్ గ్రడ్జ్ పెంచుకునేసారు . అది ఎంతలా మారిందంటే ఆఖరికి ఆయనను చంపేయాలి అన్నంత కోపంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఆయన కూతురు పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి ఇన్వైట్ చేసి మరి అన్నంలో విషం పెట్టి చంపడానికి ప్లాన్ చేశారట. అయితే ఆ దేవుడు మెగాస్టార్ ప్రాణాలను కాపాడాడు.

అప్పుడే ఆయనకు హెల్త్ బాగో లేకుండా రావడం ..ఈ క్రమంలో ఆయన ఫుడ్ ఏం తినకుండా పాపకు బ్లెస్సింగ్స్ ఇచ్చేసి ఇంటికి వచ్చేయడం తో .. సేఫ్ జోన్ గా ఆ ప్లాన్ నుంచి బయటపడిపోయాడు చిరంజీవి అన్న వార్తలు అప్పట్లో వినిపించాయి. అంతేకాదు ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి చాలా బాధపడిపోయారట. ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అంటూ చాలా హర్ట్ అయ్యారట . అప్పట్లో ఈ వార్త ఎంతో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది..!!