బాలయ్య ఫ్యాన్స్‌కి అదిరిపోయె అప్డేట్ అందించిన థమన్..!!

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా కాజల్ హీరోయిన్గా… యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ భగవంత్ కేసరి. ఈ సినిమాకి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా… షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్ గా తర్కెక్కిస్తున్నారు.

ఇప్పటికే భగవంత్ కేసరి నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్, ఫస్ట్ లుక్ గ్లింప్స్ అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీ లీల ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ఈ మూవీ యొక్క బీజీఎమ్ వర్క్ స్టార్ట్ అయిందని.. అక్టోబర్ 19న రిలీజ్ కానున్న.. ఈ మూవీతో థియేటర్స్ మొత్తం మోగిపోవడం కాయం అంటూ తన ఇన్‌స్టాలో స్టోరీ పెట్టాడు థమన్.

ఇది చూసిన బాలయ్య అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. త్వరలో ఈ మూవీ నుంచి మరొక సాంగ్ ని రిలీజ్ చేసేందుకు భగవంత్ కేసరి టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సినిమా స్టార్టింగ్ నుంచి బాలయ్య ఫ్యాన్స్‌ సినిమాతో హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధిస్తాడని నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమా రిలీజై ప్రేక్షకుల్లో ఊహించిన రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.