“ప్రామిస్..ఆ విషయం నాకు తెలియదు”..బిగ్ బాంబ్ పేల్చిన యాంకర్ అనసూయ ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ అనసూయకు ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఎంతో కష్టపడి న్యూస్ రీడర్ గా తన కెరియర్ను స్టార్ట్ చేసి ఫ్యామిలీని ఎదిరించి తన సొంత కాళ్ల పై నిలబడి తన పని తాను చేసుకునే విధంగా మారిన అమ్మాయి అంటూ అందరి దగ్గర ప్రశంసలు అందుకుంది .

కాగా అనసూయ లైఫ్ అందరికీ తెలిసిన పుస్తకం లాంటిదే . ఆమె లైఫ్ లో జరిగిన ప్రతి విషయం అందరికీ తెలుస్తూ ఉంటుంది . అందుకు అనసూయ కూడా ఏమాత్రం ఫీల్ అవ్వదు . కాగా రీసెంట్గా గానే అనసూయ జబర్దస్త్ షో నుంచి బయటికి వచ్చింది . అయితే ఆమె బయటకు రావడానికి గల కారణాన్ని కూడా ఇంటర్వ్యూలో బయటపెట్టింది . “బాడీ షేవింగ్ కామెంట్స్ భరించలేకపోయానని.. ఆ కారణంగానే బయటకు వచ్చేసానని ఓపెన్ గా చెప్పుకొచ్చింది”. అయితే ఇదే విషయాలపై ఆమెను కొందరు జనాలు అప్పట్లో ఘాటుగా ట్రోల్ చేశారు .

బాడీ షేమింగ్ కామెంట్స్ ఇప్పుడు గుర్తొచ్చాయా ..? నువ్వు ఆ షోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడే ఎలా ఉంటుంది..? షో ప్రాసెస్ ఎలా ఉంటుంది ..? షోలో ఎలాంటి డైలాగ్స్ వాడుతారు అన్న సంగతి నీకు తెలియదా..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . అంతేకాదు ఇదే విషయాలపై అనసూయ ఫ్రెండ్ కూడా ఆమెను ప్రశ్నించగా ఆమెకు జబర్దస్త్ లో ఇలాంటి వల్గర్ చీప్ డైలాగ్స్ వాడుతారని తెలియదని ..ఆ కారణంగానే ఆమె జబర్దస్త్ షోకి హోస్టింగ్ కి యాక్సెప్ట్ చేశానని.. ఒకవేళ నిజంగా అది తెలిసుంటే అసలు నేను జబర్దస్త్లోకి వెళ్ళుండే దాన్ని కాదు అని తన ఫ్రెండ్ తో సైతం క్లారిటీ గా చెప్పుకొచ్చిందట. మొత్తానికి జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసి అనసూయ మంచి పనే చేసింది . ఆ తర్వాత అమ్మడుకు బోలెడన్ని ఆఫర్స్ వస్తున్నాయి . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!