మీరా ఆత్మహత్యతో ఇండస్ట్రీ సంచ‌ల‌న నిర్ణ‌యం..!!

హీరో విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆత్మహత్యతో తమిళ్ ఇండస్ట్రీ తీవ్రమైన బాధలో ఉంది. ఇటీవల కోలీవుడ్ జైలర్ నటుడు గుండెపోటుతో మరణించాడు. ఆ ఘటన మరవక ముందే యాంటోనీ కూతురు చనిపోవడంతో కోలీవుడ్ పరిశ్రమతో పాటు పలువురిని కలిచివేసింది.

కాగా అంత్యక్రియల సమయంలో బాధతో ఉన్న కుటుంబ సభ్యులను తమిళ్ ప్రముఖ మీడియా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ పలు ప్రశ్నలతో ఇబ్బందికి గురి చేశారని.. నివాళులర్పించేందుకు వచ్చే సెలబ్రిటీలతో పోటీపడి మైక్లు పట్టుకొని ఇంటర్వ్యూలు చేసి ఆ వీడియోలకు తప్పుడు తంబ్నైల్స్ పెట్టి న్యూస్ కోసం పలు యూట్యూబ్ ఛానల్స్ పోటీపడ్డాయట.

దీంతో ఇకనుంచి తమిళ్ సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తుల మృతికి సంబంధించిన సంఘటనలకు మీడియాను అనుమతించమని నిర్ణయాలు తీసుకొని ప్రకటించింది. ఈ మేరకు నిర్మాతల సంఘం అధ్యక్షుడు భారతీరాజ్ అనౌన్స్ చేశారు. కుటుంబ బంధాలకు విలువనిచ్చి సొసైటీలో ఈ నిర్ణయాన్ని మీడియా గౌరవించాలని ఆయన తెలిపారు.

ఒక వ్యక్తి చనిపోతే ఎక్కువ నష్టం బాధ్యత కుటుంబానికి ఉంటుంది. ఇలాంటి బాధాకరమైన సమయంలో మీడియా వారికి ఏమన్నా సంబంధం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. పోలీసుల అనుమతి ఉన్న కూడా చనిపోయిన వారి ఇంటి వద్దకు రావడానికి ఇకపై మీడియా సంస్థలకు అనుమతి ఉండదని ఆయన వెల్లడించారు.