కంగనా చంద్రముఖి పాత్ర చేయడం పై జ్యోతిక కామెంట్స్..అంత మాట అనేసింది ఏంటి..?

చంద్రముఖి ఈ పేరు చెప్తే ఇంకా కొంతమంది జనాలు భయపడే వారు ఉన్నారు. మనలో అలాంటి జనాలు చాలామంది ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు 18 ఏళ్లవుతుంది . ఇప్పటికి ఈ సినిమాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమా టీవీలో వస్తే టీవీకి అతుక్కుపోయి భయం భయంగా దుప్పటి కప్పుకొని మరి ఈ సినిమాను టీవీలో చూస్తూ ఉంటారు జనాలు . మరి ముఖ్యంగా చంద్రముఖి అనగానే అందరికీ కళ్ళ ముందు మెదులాడేది జ్యోతిక . ఆ చీరలో.. కళ్ళకు కాటుక పెట్టుకుని ..జుట్టు విరబోసుకొని లక లక లక్ అంటే కచ్చితంగా భయపడి పోవాల్సిందే .

అలాంటి ఓ నటిని చంద్రముఖి పాత్రలో చూపించింది జ్యోతిక . కాగా సినిమా రిలీజ్ అయిన 18 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఆ సినిమాను డైరెక్ట్ చేసిన పీ వాసు చంద్రముఖి సీక్వెల్ కూడా డైరెక్ట్ చేస్తున్నారు . రజినీకాంత్ సీక్వెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఈ ప్రాజెక్టును రాఘవ లారెన్స్ చేస్తున్నాడు . హారర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయిన రాఘవ ఆ ఎక్స్పీరియన్స్ తోనే ఈ సినిమాను అద్భుతంగా చేస్తాడన్న నమ్మకం ఫాన్స్ లో నెలకొంది . రీసెంట్గా చంద్రముఖి 2కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అయితే సినిమాలో భయం కన్నా ఎక్కువగా గ్లామర్ ఉంది అంటూ నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.

సెప్టెంబర్ 15న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . చంద్రముఖి పాత్రలో ఈసారి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా కనిపించబోతుంది. ఈ క్రమంలోనే చంద్రముఖి సినిమాలో నటించిన జ్యోతిక చంద్రముఖి 2 లో నటించిన కంగనా పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది . సోషల్ మీడియా ద్వారా ఓ నొట్ రాసుకొచ్చింది. ” భారతీయ చలనచిత్ర పరిశ్రమ గొప్ప నటనలో ఒకరు కంగనా.. ఆమె చంద్రముఖి పాత్రను పోషించడం చాలా చాలా గర్వంగా ఉంది “..అంటూ పోస్ట్ చేసింది. అయితే కంగనా చంద్రముఖి పాత్రలో ఏమాత్రం సెట్ కాలేదు . చాలామంది ఇవే డైలాగ్స్ కొడుతున్నారు . కానీ జ్యోతిక మాత్రం కంగనాన్ని ఈ రేంజ్ లో పొగిడేయడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆమె చేత బలవంతంగా ఇలా చెప్పించారా..? అంటున్నారు కొంతమంది జనాలు . చూడాలి మరి సెప్టెంబర్ 15 ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో..?