రూల్స్ రంజాన్ సినిమాతో హిట్టుకొట్టేలా ఉన్న కిరణ అబ్బవరం.. ట్రైలర్ అదుర్స్..!!

టాలీవుడ్ లో కుర్ర హీరోలలో వరస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న హీరో కిరణ్ అబ్బవరం ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట పలు రకాల షార్ట్ ఫిలిం నుంచి హీరోగా ఎదిగి కొన్ని సినిమాలలో నటించారు కిరణ్ అబ్బవరం.. మొదట రాజావారు రాణి గారు అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.. తన తొలి సినిమాతోనే నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం ఆ వెంటనే ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు..

ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు కిరణ్ అబ్బవరం..అయితే ఇప్పటివరకు సాలిడ్ హీట్ ను మాత్రం అందుకోలేకపోయారు. తాజాగా రూల్స్ రంజన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నేహా శెట్టి నటిస్తోంది.. ఈ సినిమా నుంచి ఇప్పటికి విడుదలైన సమ్మోహనుడా అనే పాట కూడా మంచి సక్సెస్ అందుకుంది ఈ పాటకు చాలామంది రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ పైన మంచి బస్ క్రియేట్ అవుతోంది.

ఈ ట్రైలర్లో నేహా శెట్టి తన అందంతో మరొకసారి ఆకట్టుకోగా కిరణ్ అబ్బవరం కూడా తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ట్రైలర్ లో కిరణ్ అబ్బవరం రూల్స్ పాటించే కుర్రాడుగా కనిపిస్తున్నారు. ఇందులో కమెడియన్స్ వైవాహర్ష, ఆది కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే వెన్నెల కిషోర్ కామెడీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే ఈసారి కూడా కిరణ్ అబ్బవరం కామెడీని నమ్ముకున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా ఎలా ఉందో తెలియాలి అంటే సెప్టెంబర్ 28 వరకు ఆగాల్సిందే.