ప్రభాస్ రియల్ ఏజ్ ఎంతో తెలుసా..? వైరల్ అవుతున్న ఆధార్ కార్డ్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే.. అది ఖచ్చితంగా రెబల్ హీరో ప్రభాస్ పెళ్లి మేటర్ అని చెప్పాలి. ఈ పాన్ ఇండియా హీరోకి పెళ్లి వయసు వచ్చి.. దాటన కూడా దాటేస్తుంది అయినా సరే ఇప్పటివరకు పెళ్లి గురించి ప్రస్తావనే తీసుకురావడం లేదు . ఇతగాడు పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది ఇండస్ట్రీలో ఉండే స్టార్ ప్రముఖులు.. అభిమానుల కోరిక . అయితే ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తాడు ప్రభాస్ అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు.

ప్రభాస్ కి ఏజ్ ఎక్కువ అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ ఆయన ఎగ్జాక్ట్ ఏజ్ అనేది ఎవరికి సరిగ్గా తెలియదు. సోషల్ మీడియాలో కొందరు 50 దాటేసింది ప్రభాస్ కి అంటూ కూడా ప్రచారం చేస్తూ వచ్చారు . కాగా రీసెంట్ గా ప్రభాస్ ఆధార్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఆధార్ కార్డ్ ప్రకారం ప్రభాస్ ఏజ్ 43 దాటింది . 23 – 10 – 1979లో ప్రభాస్ జన్మించారు.

ఆధార్ కార్డు డేట్ ప్రకారం ప్రభాస్ ఏజ్ 43 దాటేస్తుంది. అఫ్కోర్స్ ఇది చిన్న ఏజ్ అని చెప్పడం లేదు కానీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు పెద్ద ఏజ్ కూడా కాదు ..పెళ్లి చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకోవాలి.. ఇక ఈ తర్వాత కూడా చేసుకోకపోతే ప్రయోజనమే ఉండదు అంటూ కూడా వ్యంగ్యంగా కౌంటర్ వేస్తున్నారు జనాలు . మొత్తానికి ప్రభాస్ ఏజ్ తో మరోసారి ఆయన పెళ్లి మేటర్ వైరల్ గా మారింది..!!