అదే నిజమైతే నెక్స్ట్ పడే వికెట్ బాలయ్యదే.. అభిమానులను టెన్షన్ పెడుతున్న లెటేస్ట్ న్యూస్..!!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ తో సోషల్ మీడియాలో నందమూరి బాలయ్యను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేర్లు మెగాస్టార్ చిరంజీవి -నందమూరి బాలకృష్ణ – అక్కినేని నాగార్జున – విక్టరీ వెంకటేష్.. ఈ నలుగురు పేర్లు ఎక్కువగా అందరికీ గుర్తొస్తూ ఉంటాయి. అయితే మొదటి ఇన్నింగ్స్ లో కెరీర్ ఎలా ఉన్నా సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ నలుగురు హీరోల్లో ముగ్గురు హీరోల కెరియర్ ఏంటో అర్థం అయిపోతుంది జనాలకి.

విక్టరీ వెంకటేష్ – అక్కినేని నాగార్జునలు ఇద్దరు సైడ్ ట్రాక్ పట్టేశారు . చేతికి వచ్చిన సినిమాలు చేసుకుంటూ సీనియర్ పాత్రలు పోషిస్తున్నారు. అడపా దడపా నాగార్జున హీరోగా నటిస్తున్న ఆ సినిమాలు ఫ్లాప్ అవుతూనే వస్తున్నాయి . రీసెంట్గా చిరంజీవి సైతం హీరోగా ఇక సెట్ కాడు అని కొన్ని సినిమాల రిజల్ట్స్ చెప్పకనే చెప్పేస్తున్నాయి . ఇక మిగిలింది బాలకృష్ణ ఒక్కడే.. బాలకృష్ణ ఒక్కడే ఈ నలుగురిలో ఇప్పటికి హీరోగా నటిస్తూ 100 కోట్లను క్రాస్ చేస్తూ సత్తా చాటుతున్నారు .

అయితే రానున్న రోజుల్లో బాలకృష్ణ వికెట్ కూడా డౌన్ అయిపోవడం కన్ఫామ్ అంటున్నారు సినీ ప్రముఖులు . ఏజ్ మీద పడిపోయే కొద్ది ఎంత మేకప్స్ వేసిన ఎంత కష్టపడినా ఆ క్రేజ్ తీసుకురాలేమని . ఇక బాలయ్య కూడా సీనియర్ రోల్స్ చేసుకోవాల్సిందే అని సజెస్ట్ చేస్తున్నారు . అంతేకాదు భగవంత్ కేసరి తర్వాత బాలయ్య బాబి డైరెక్షన్లో సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య కూడా సీనియర్ రోల్స్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. అందుకే యంగ్ జనరేషన్ కథలను దూరం పెడుతూ వస్తున్నారట . దీంతో ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడిపోతున్నారు..!!