అబ్బాయిలతో మాత్రమే చేస్తా.. అమ్మాయిలతో నావల్ల కాదు.. షకీలా….!!

బుల్లితెర‌పై ‘ బిగ్ బాస్ ‘6 సీజన్లు పూర్తి చేసుకుని తాజాగా 7వ‌ సీజన్లోకి అడుగు పెట్టింది. గత సీజన్తతో పోలిస్తే ఈ సారి ప్రేక్షకులని మరింత ఆకట్టుకునేట్టుగా ఈ సీజ‌న్‌ను ప్రిపేర్ చేశారు బిగ్ బాస్ టీం. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇంట్లో నామినేషన్ల ప్రక్రియ మొదల కాగా.. గొడవలు స్టార్ట్ అయ్యాయి.

నువ్వా నేనా అన్నట్టుగా కొట్టుకుంటున్నారు హౌస్ మేట్స్. ఇక ఈ వారం ఇమ్యూనిటీ పవర్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ మేరకు ” శారీరకంగా మానసికంగా తమను తాము ప్రేక్షకులకు నిరూపించుకుంటూ చివరకు విజేతగా నిలిచిన వారికి ఏకంగా 5 వారాల ఇమ్యూనిటీ పవర్ పొందే అవకాశం లభిస్తుంది” అని ప్రకటించి అందులో మొదటి టాస్క్ చెప్పాడు బిగ్ బాస్.

ఇచ్చిన మొదటి టాస్క్ ఫేస్ ద బీస్ట్. ఇందులో బాగా బాడీలు పెంచిన అమ్మాయిని, అబ్బాయిని లోపలికి పంపించారు. వారితో కుస్తీ ఆడి గేమ్ లో గెలవాలి. అయితే షకీలా మాత్రం నేను అబ్బాయితో కుస్తీ పోటీ పడతా కానీ.. అమ్మాయితో నాకు ఇష్టం ఉండదు అంటూ తెలిపింది. ప్రస్తుతం షకీలా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.