పబ్లిక్ లో ముద్దులు పెట్టుకున్న నరేష్, పవిత్ర.. పిక్స్ వైర‌ల్..!!

సీనియర్ హీరో నరేష్, పవిత్ర లోకేష్ రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ జంట పేర్లు మారుమోగుతుంది. సోషల్ మీడియాలో వారికి సంబంధించి ఎలాంటి న్యూస్ అయినా నెట్టింట వైరల్ గా మారుతుంది. తాజాగా ఈ కపుల్ ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. వినాయక చవితి సందర్భంగా ఆ షో టెలికాస్ట్ కానుంది.

శ్రీముఖి, హైపర్ ఆది హోస్ట్‌లుగా వ్యవహరించిన ఈ షోకు గెస్ట్‌లుగా నరేష్, పవిత్ర వచ్చారు. తాజాగా ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా ఇందులో భాగంగా నరేష్ పువ్వు ఇచ్చి పవిత్రకు ప్రపోజ్ చేశాడు. దీంతో ప్రపోజల్‌కి ఫిదా అయినా పవిత్ర లోకేష్ నరేష్ చెంపపై ముద్దు పెట్టింది. దీంతో ఈ పిక్స్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దీంతో ఈ పిక్స్ చూసిన నెటిజన్‌లు ముసలోళ్ళకి దసరా పండుగ అన్నట్లు ఈ వయసులో మిమ్మల్ని ఇలాంటి షోలకు పిలవడమే తప్పు.. పైగా మీకు ఇలాంటి రొమాంటిక్ సీన్స్ అవసరమా.. అంటూ ఆల్రెడీ పెళ్లై పిల్లలు ఉన్న మీరు మళ్లీ ఇలా పబ్లిక్ లో రొమాన్స్ చేసుకోవడానికి సిగ్గుగా లేదా.. అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.