శ్రీకృష్ణ గెటప్ విషయంలో నందమూరి హీరోలకు మాత్రమే సొంతమైన రేర్ రికార్డ్.. ఎంటో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు కృష్ణుడి పాత్రలో నటించి ప్రేక్షకులు మెప్పించారు. వారిలో కేవలం నందమూరి హీరోలు మాత్రమే ఓ అరుదైన రికార్డును సృష్టించారు. మొత్తం నాలుగు తరాల నుంచి వస్తున్న హీరోలంతా కృష్ణుడి గెటప్ లో ప్రేక్షకులను మెప్పించారు. ఈరోజు కృష్ణాష్టమిని ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టీవీలలో కూడా సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన పలు కృష్ణుని సినిమాలు వస్తున్నాయి.

సీనియర్ ఎన్టీఆర్ పదుల సంఖ్యలో కృష్ణుడు పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక హరికృష్ణ కూడా శ్రీకృష్ణ అవతారం సినిమాలో కృష్ణుని పాత్రలో మెప్పించాడు. శ్రీకృష్ణ విజయం, పాండురంగడు సినిమాలతో బాలయ్య కృష్ణుడు పాత్రలో మెప్పించాడు. బృందావనం సినిమాలో కూడా కొన్ని సెకన్ల పాటు జూనియర్ ఎన్టీఆర్ మోడరన్ కృష్ణ గెటప్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇలా నందమూరి హీరోలంతా దాదాపుగా కృష్ణుని పాత్రలో నటించి మెప్పించారు.

నందమూరి హీరోలు మాత్రమే ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకోవడం గమనార్హం. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నందమూరి హీరోలుగా మంచి క్రేజ్‌తో కొనసాగుతున్నారు. భారీ విజ‌యాలు అందుకుంటూ పాపులారిటీ తప్పించుకుంటున్నారు. వీరు పాన్ ఇండియా లెవెల్ లో మరిన్ని సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక వీరికి ఇతర భాషల్లో సైతం క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. అత్యధి రెమ్యున‌రేషన్ తీసుకున్న స్టార్ హీరోల్లో నందమూరీ హీరులు కూడా ఉన్నారు.