ఆ భయం ఎప్పటికీ నన్ను వదలదు.. అనుష్క సెన్సేషనల్ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క చాలా కాలం తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నవీన్ పోలిశెట్టి తో కలిసి నటిస్తున్న సినిమా ” మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి “. ఈ సినిమా సెప్టెంబర్ 7 (ఈరోజు) విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలకు ముందు పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ.. ” ఈ సినిమాలో తను ఒక చెఫ్ పాత్రలో నటించానని తెలిపింది. ఇందులో తన పాత్ర చాలా వైవిధ్య భరతంగా ఉంటుందని అనుష్క వెల్లడించింది.

ఇందులో మీరు చెఫ్ పాత్రలో నటించారు మరి నిజంగా కూడా మీకు వంట చేయడం వచ్చా అని ప్రశ్నించగా.. నాకు వంట చేయడం అయితే వచ్చు కానీ మా అమ్మ చేసినంత రుచిగా వంటలు చెయ్యలేను అని తెలిపింది. కానీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే మాత్రం భోజనం పెట్టకుండా అస్సలు వదలనని నాకు వచ్చిన వంటలు చేసి వారికి భోజనం పెట్టి పంపిస్తానని అనుష్క చెప్పింది. మీరు ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 18 సంవత్సరాలు అవుతుంది.

అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో మీ ప్రయాణం ఇంత సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుందని ఊహించారా అని ప్రశ్న వేయగా.. నాసినీ కెరీర్ ఇంత కాలం కొనసాగుతుందని నేను అసలు ఊహించలేదు. ఎలాంటి ప్రణాళికలతో నేనెప్పుడూ ముందుకు వెళ్లలేదు నాకు అన్ని తెలివితేటలు కూడా లేవు. నేను చేసే ఏ పాత్ర అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవాలి ఆ పాత్రకు నేను సరైన న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే నా నటనని కొనసాగిస్తున్నాను.

ఇక కెరీర్ మొదట్లో నన్ను ఎప్పుడు కూడా ఒక భయం వెంటాడుతూనే ఉంది. అదేంటంటే.. సెట్లోకి వెళ్లి డైలాగులు కరెక్ట్ గా చెప్పగలుగుతానా… నాకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేయగలుగుతానా.. నిర్మాతలు నాపై పెట్టుకున్న నమ్మకాలన్నీ నిలబెడతానా అనీ భయపడే దాన్ని అని తెలిపింది అనుష్క. ఇప్పటికీ కూడా నేను ఏదైనా ఒక కొత్త సినిమా చేస్తున్నానంటే కొద్ది రోజులు నా భయం నాలో ఉంటుందంటూ అనుష్క తెలియజేసింది. ప్రస్తుతం అనుష్క వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.