బిగ్‌బాస్‌లో ముద్దుల గోల‌… హీరోయిన్ ముద్దు కోసం పెద్ద ర‌చ్చ‌…!

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 తాజాగా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పుడిప్పుడే టాస్కులు స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ అంతా ఉల్టా పల్టా అని ముందుగానే బిగ్‌బాస్ భయపెడుతూ ఉంటే దేనికైనా రెడీ అని హౌస్ మేట్స్ తెగించారు. ఓ పక్కన టాస్కులతో ఉత్తేజంగా ఆడుతున్న మరోపక్క తోటి కంటిస్టెంట్‌ల‌తో బంధాలు ఏర్పరుచుకుంటూ కొనసాగుతున్నారు. ఈ విషయంలో అందరికంటే యమా జోరుగా ఉన్నాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.

హౌస్ లోకి వచ్చిన రెండు రోజుల్లోనే హీరోయిన్ రితికా రోస్‌ని బుట్టలో వేసుకున్నాడు. తన మనసే ఇచ్చేస్తానని ఆమె అనడంతో ప్రశాంత్ సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక దాంతో తాజాగా టేస్టీ తేజ కూడా ఇలాంటి ఏదైనా వర్కౌట్ అవుతుందేమోనని ట్రై చేస్తున్నాడు. శుభశ్రీ రాయగురు తేజను అమ్మాయిల రెడీ చేసేందుకు సిద్ధమైంది. అతడు ముఖాన్ని మేకప్ అది జుట్టుకు పిలక వేసింది. అనంతరం లిప్‌స్టిక్ వేస్తుండగా డైరెక్ట్ గా పెదాలతో లిప్స్టిక్ వేయవచ్చుగా అని ఓ బిస్కెట్ వేశాడు తేజ.

తేజ మాటలు విని షాక్ అయినా శుభశ్రీ అలాంటి పప్పులు ఏమి నా దగ్గర ఉడకవ్ అంటూ చెంపపై లిప్ స్టిక్‌ రుద్దింది. అయినా సరే తేజ వద‌ల‌కుండా తనకు డైరెక్ట్ గా లిప్ స్టిక్ కావాలని గోల చేసాడు. దీంతో అక్కడే ఉన్న షకీలా అంతేనా అని అతడి బుగ్గన ముద్దు పెట్టింది. అలా అతడి బుగ్గపై షకీలా లిప్‌స్టిక్ మరకలు పడ్డాయి. దీంతో అక్కడ ఉన్న వారంతా నవ్వుకున్నారు. అయితే తేజ తనకు దేవుడిచ్చిన కొడుకు అని షకీలా చెప్పుకొచ్చింది.