రెండో పెళ్లి చేసుకోబోతున్న శ్రావణ భార్గవి..? హల్దీ ఫోటోస్ వైరల్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏం న్యూస్ నిజం.. ఏ న్యూస్ అబద్ధమని తెలుసుకోవడం చాలా చాలా కష్టంగా మారిపోతుంది. మరీ ముఖ్యంగా స్టార్స్ కి సంబంధించిన పలు పర్సనల్ విషయాలు నెట్టింత లీక్ అయి వైరల్ అవుతూ ఉండడమే కాకుండా మరికొన్ని ఫేక్ వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో స్టార్ సెలబ్రెటీస్ ప్రైవసీ లైఫ్ కి భంగం కలుగుతుంది.

రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ శ్రావణ భార్గవికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది. శ్రావణ్ భార్గవి సింగర్ హేమచంద్రను ప్రేమించి పెళ్లి చేసుకుంది . 2013లో వీళ్లిద్దరి పెళ్లి గ్రాండ్గా జరిగింది . వీరికి ఓ పాప కూడా ఉంది . వీళ్ళ మధ్య వచ్చిన కొన్ని మనస్పర్ధలు కారణంగా వీళ్ళిద్దరూ విడిపోయారని ..దూరం దూరంగా ఉంటున్నారని ..విడాకులు కూడా తీసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలో నిజం లేదు అంటూ వాళ్ళిద్దరూ అప్పట్లోనే తిప్పి కొట్టారు . అయితే ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి తిరిగిన ఫొటోస్ లేదా ఏ ఫంక్షన్ లో వీళ్ళిద్దరూ కలిసి కనిపించకపోవడంతో వీళ్లు నిజంగానే విడాకులకు అప్లై చేశారని విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది.

అయితే కొందరు ఆకతాయిలు శ్రావణ భార్గవి తన బ్రదర్ పెళ్లిలో దిగిన హల్ది ఫంక్షన్ ఫొటోస్ ను ట్రెండ్ చేస్తూ రెండో పెళ్లి చేసుకోబోతుంది..శ్రావణ భార్గవి అని పుకార్లు పుట్టించేశారు . సెలబ్రిటీ కావడంతో ఈ వార్త సెకండ్స్ లోనే వైరల్ గా మారింది . ఒక్కసారిగా ఈ వార్త విన్న శ్రావణ భార్గవి ఫాన్స్ కూడా టెన్షన్ పడిపోయారు. అయితే ఇది కేవలం ఫేక్..శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకోవడం లేదు ..శ్రావణ భార్గవి తన బ్రదర్ పెళ్లిళ్లు దిగిన ఫొటోస్ ను అలా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ట్రెండ్ చేస్తున్నారు తప్పిస్తే శ్రావణ భార్గవి రెండో పెళ్లిపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన కూడా చేయలేదు. ఎవరో కావాలనే కొందరు ఆమెకు సంబంధించిన ట్రెడిషనల్ ఫొటోస్ ఇలా ట్రోల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!