సైమా అవార్డ్స్ లో శ్రీ లీలా వేసుకున్న ఆ సింపుల్ డ్రెస్ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!!

ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇటీవల సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుక దుబాయ్ లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రతిభ‌ను గుర్తించేందుకు ఈ ప్రెస్టేజియస్ సైమా అవార్డును అందజేస్తారు. గత ప‌ద్దేళ్ళుగా కొనసాగుతున్న ఈ అవార్డులు వేడుకలు తాజాగా 11వ వసంతంలోకి అడుగుపెట్టాయి. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ హీరో రానా, మంచి లక్ష్మి హోస్ట్‌లుగా వ్యవహరించారు.

ఇక సెప్టెంబర్ 15న తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డు వేడుకలు జరిగాయి. ముఖ్యంగా నటీనటులు ఇచ్చేటువంటి అవార్డులలో సైమా అవార్డు చాలా ప్రత్యేకం. శుక్రవారం సైమ అవార్డు ఫంక్షన్ లో ఎంతోమంది సినీ తారలు తలుక్కున మెరిశారు. అయితే వారిలో శ్రీ లీల కూడా ఓ స్పెషల్ ఎట్రాక్షన్ గా చెప్పవచ్చు. పింక్, బ్లాక్ కాంబినేషన్లో ట్రెండీ వేర్ లో మెరిసింది శ్రీ లీల. అయితే చూడడానికి సింపుల్గా కనిపిస్తున్న అడ్రస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా వెరైటీగా సింపుల్ గా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసుకోవాలని నెటిజ‌న్‌లు ఆసక్తిగా సెర్చింగ్ మొదలు పెట్టారు.

 

ఇక ఆ అవార్డ్ ఫంక్షన్ లో శ్రీల వేసుకున్న డ్రెస్ ఖరీదు అందరికీ ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ఆమె వేసుకున్న ఈ పింక్ కలర్ సింపుల్ డ్రెస్ కాస్ట్ రూ.36 వేలు అట. అయితే చూడడానికి ఇంత సింపుల్ గా ఉన్న డ్రెస్ ఖరీదు అంత కాస్ట్ అని తెలియడంతో షాక్ అవుతున్నారు జ‌నం. దుబాయిలో జరిగిన ఈ సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో శ్రీల ధ‌మాక సినిమాలో తన నటనకు ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కొద్దికాలంలోనే శ్రీలీల మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ఎదిగిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో 12 సినిమాలు ఉన్నాయి.