చరణ్ వదులుకుంటేనే ఆ అవార్డ్ ఎన్టీఆర్ కి వచ్చిందా..? సైమా అవార్డ్ పై కొత్త డౌట్లు..!!

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో కొందరు హీరోల ఫ్యాన్స్ మరి టూమచ్ చేసేస్తున్నారు. ఎంతలా అంటే సైలెంట్ గా ఉండే కొద్ది మరీ గిచ్చి గిల్లి రెచ్చగొడుతున్నారు . ప్రెసెంట్ అలాంటి న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ కి సౌత్ ఇండియన్ స్టార్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా అవార్డు వచ్చింది. ఆర్.ఆర్.ఆర్ చిత్రంకి గాను ఈ అవార్డు వచ్చింది.

 

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ దుబాయ్ కి వెళ్లి మరి అవార్డు అందుకున్నారు . అవార్డు అందుకున్న తర్వాత చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఫాన్స్ హాట్ టచ్ చేసాడు తారక్. ఈ సినిమాలో చరణ్ కూడా నటించారు. అయితే ఈ సినిమాలో ఈ అవార్డు ముందుగా రామ్ చరణ్ కి వచ్చిందట . ఆయనకు అవార్డు వరించిందట. కానీ రామ్ చరణ్ కు ఆరోగ్యం బాగోలేనందుకు కారణంగా .. ఆయన సైమా అవార్డ్స్ కు రాలేనని స్పెషల్ రిక్వెస్ట్ చేశారట .

ఈ క్రమంలోనే అవార్డు సెకండ్ లిస్ట్ లో ఉన్న ఎన్టీఆర్ కి ఇచ్చారంటూ సరికొత్త రూమర్ను క్రియేట్ చేసే ట్రెండ్ చేస్తున్నారు కొందరు హీరోల ఫ్యాన్స్ . దీంతో నందమూరి ఫుల్ ఫైర్ అయిపోతున్నారు. మా హీరోకి అవార్డు రావడం మీకు ఇష్టం లేదని.. అందుకే ఇలా కుళ్ళుకొని బాధపడిపోతున్నారు అని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు సోషల్ మీడియాలో పలు విధాలుగా కొందరు ఫాన్స్ ఈ న్యూస్ ని హైలైట్ గా చేస్తూ బూతులు తిట్టుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!