హీరో అల్లరి నరేష్ నటించిన సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ శ్రద్ధాదాస్. ముంబై ప్రాంతానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తెలుగులోనే కాకుండా కన్నడ ,మలయాళం, బెంగాలీ ,హిందీ వంటి భాషలలో కూడా నటించింది. ఇప్పటివరకు ఈమె 30కి పైగా సినిమాలలో నటించిన పెద్దగా స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేకపోయింది. హీరోయిన్గా నటించిన సినిమాలన్నీ పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.
దీంతో పలు చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది అవి కూడా పెద్దగా కలిసి రాలేకపోవడంతో బుల్లితెర పైన జడ్జ్ గా పలుషోలకు వ్యవహరిస్తూ ఉండేది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ రెచ్చిపోతూ ఉంటుంది శ్రద్ధాదాస్.. సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటున్న శ్రద్ధాదాస్ ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పటివరకు ఈమె సింగిల్గానే గ్లామర్ షో చేస్తూ ఉన్న ఫోటోలను మనం చూస్తూ ఉన్నాము..
కానీ ఒక్కసారిగా ఒక యువ నటుడితో రొమాన్స్ చేస్తూ ఉన్న ఫోటోలను షేర్ చేసి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది..అయితే ఆ నటుడు ఎవరో కాదు అభితేష్ ద్వివేది.. వీరిద్దరూ కలిసి రొమాన్స్ గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ లవ్ బర్డ్స్ అంటూ కూడా అభిమానులు సైతం ఫిక్స్ అయిపోయారు అంతేకాకుండా వీరికి ఆల్ ది బెస్ట్ చెబుతూ బోత్ ఆఫ్ యు సూపర్ పెయిర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై శ్రద్ధదాస్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.
View this post on Instagram