భోళాశంకర్ ఫ్లాప్ పై అలాంటి కామెంట్స్ చేసిన వర్మ..!

డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫెయిల్యూర్ గా నిలిచింది. తమిళ్ వేదాళం సినిమాకు రీమిక్కుగా తెరకెక్కించిన ఈ సినిమా నెగిటివ్ టాక్ మూట కట్టుకుంటోంది. అయితే మెగా అభిమానులు మాత్రం సినిమా బాగా లేకపోయినా కాస్తయినా వెనకేసుకొస్తూ ఉండేవారు.. కానీ ఈ విషయంలో మాత్రం మెగా అభిమానులు చాలా అసంతృప్తిలో ఉన్నట్లు వార్త వినిపిస్తున్నాయి.. చిరంజీవి ఇమేజ్ను సైతం డ్యామేజ్ చేసేలా భోళా శంకర్ సినిమా ఉండబోతుందని కొంతమంది అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు.

Chiranjeevi | Chiranjeevi and Ravi Teja's new movie Waltair Veerayya to  release on January 13 - Telegraph India

ఒక రేంజ్ లో అంచనాలతో విడుదలైన భోళా శంకర్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం తో సోషల్ మీడియాలో ఈ సినిమా పైన పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో కొంతమంది చాలా అతిగా మాట్లాడడం కూడా ఈ సినిమా అనర్ధాలకు దారి తీసింది.. దీంతో రాంగోపాల్ వర్మ కూడా కొన్ని ట్వీట్స్ చేయడం జరిగింది.. చిరంజీవి కొంతమంది పొగడ్తలకు పడిపోయి కథల విషయంలో చాలా పొరపాట్లు చేస్తున్నారంటూ ట్విట్ చేశారు.

Happy Birthday Ram Gopal Varma: From Siva to Anaganaga Oka Roju, 5 films of  the director that have a special place in our hearts | The Times of India

ఇప్పుడు తాజాగా మరొక ట్విట్ చేస్తూ వాల్తేరు వీరయ్య సినిమా ఎవరి మూలాన ఆడిందో ప్రూఫ్ చేయడానికి తీసినట్లు ఉంది భోళా శంకర్ సినిమా అంటూ ఒకటి చేశారు.. వాస్తవానికి వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కూడా నటించారు.. ఈ కారణంగానే ఆ సినిమా ఆడింది అని ప్రూఫ్ చేసేందుకు భోళా శంకర్ సినిమా చేసినట్లు ఉంది అంటూ అర్థం వచ్చేలా వర్మ విట్ చేయడంతో పలువురు నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.