పెళ్లికాకముందే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన‌ శ్రీ లీల.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజ‌న్లు..!

యంగ్ బ్యూటీ శ్రీ లీల ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది. వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీ స్కెడ్యూల్ గడుపుతున్న శ్రీ లీల రెమ్యూనరేషన్ కూడా భారీ రేంజ్ లో పనిచేస్తుందట. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను బాగా ఫాలో అవుతున్న శ్రీ లీల కేవలం సినిమాలు, రమ్యున‌రేషన్ అంటూ ఆస్తులను కూడా పెట్టుకోవడమే కాక ఆమె మంచి మనసులు కూడా చాటుకుంటుంది.

ఓ సినిమా షూటింగ్లో భాగంగా అనాధాశ్రమానికి వెళ్ళిన శ్రీ లీల అక్కడ గురు, శోభిత అనే ఇద్దరు పిల్లలను చూసి జాలి వేసి వాళ్లను దత్తత తీసుకుంది. ప్రస్తుతం ఆ ఇద్దరు పిల్లలు శ్రీ‌లీలా దగ్గర ఉంటున్నారు. వారిద్దరి బాగోగులు శ్రీలీలానే చూసుకుంటుందట. అంతేకాదు సాధారణంగా స్టార్ హీరో హీరోయిన్లు బ్రాండెడ్ వస్తువులనే కొనుక్కుంటూ మల్టీప్లెక్స్లలో మాత్రమే షాపింగ్ చేస్తూ ఉంటారు.

కానీ శ్రీలీల కు మాత్రం స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టమట. దీనివల్ల చిన్న తరహా వ్యాపారస్తులు బాగుపడతారు అలాగే జల్సాల కోసం ఎక్కువ ఖర్చు పెట్టినట్టు కూడా ఉండదు అనే ఉద్దేశంతో శ్రీ‌లీలా స్ట్రీట్ షాపింగ్‌కే ఎక్కువ ఆసక్తి చూపుతోందని స్వయంగా తానే ఓ ఇంటర్వ్యూలో వివ‌రించింది.ఇక ప్రస్తుతం శ్రీ‌లీలాకి సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో శ్రీ లీల మంచి మనసుకు హ్యాట్సాఫ్ చెప్తున్నారు నెటిజన్లు.