యూకే ప్రైమ్ మినిస్టర్ రిషి సునక్ అత్తగారికి ప్రభాస్ సినిమా పాట అంటే అంత ఇష్టమా.. ఏ పాట తెలుసా..!?

ఇన్ఫోసిస్ స‌హ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య సుధా మూర్తి ఈమెకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు వార్తల్లో వైరల్ అవుతూ ఉండే ఈమె సింప్లిసిటీ అంటే చాలా ఇష్టపడుతుంది. అంతేకాదు ఇంటర్వ్యూలో ఎపుడు చెప్పా పలు విషయాలపై అనేకమంది ప్రేరణ పొందుతారు. సుధామూర్తి ఇటీవలే వెజ్ – నాన్ వెజ్ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. రీసెంట్‌గా సుధా మూర్తి తనకు ఇష్టమైన తెలుగు సినిమా పాట ఏంటి అని అడగగా ఒక ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.

 

సుధా మూర్తి ఎప్పటికప్పుడు మీడియాతో మాట్లాడుతూ ఎన్నో విలువైన విషయాలను చెబుతూ ఉంటుంది. ఈ మధ్య తన కూతురు వల్లే రిషీ సునక్‌ బ్రిటన్ ప్రధాని అయ్యాడు అంటూ మాట్లాడింది. అప్పట్లో ఈ కామెంట్స్‌ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు తనను యూకే ప్రధాని అంటే ఎవరు నమ్మట్లేదని ఓ సందర్భంగా వివరించింది. వెజ్ – నాన్ వెజ్ స్పూన్ అంటూ ఆవిడ చేసిన వ్యాఖ్యలు భారీ చర్చకు దారి తీసాయి. ఇవన్నీ పక్కన పెడితే సుధామూర్తికి తెలుగు సినిమా పాటలు అంటే చాలా ఇష్టమట.

మరి ఆవిడకు తెలుగు సినిమా పాట ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలోని కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే అని.. ఆ పాట తనకు చాలా ఇష్టమని సుధా మూర్తి వివరించింది. అంతేకాదు ఆ పాట ప్లే అయ్యేటప్పుడు సరదాగా ఆమె కూడా హమ్ చేస్తూ ఉంటుందట. సుధా మూర్తి లాంటి పెద్ద పేరు ఉన్న వ్యక్తి మన తెలుగు పాటను ఇష్టపడడంతో ప్రస్తుతం ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.