`జైల‌ర్‌` మూవీకి అనిరుధ్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. హీరోలు కూడా వేస్టే!?

జైల‌ర్‌.. రీసెంట్ గా విడుద‌లైన యాక్ష‌న్ కామెడీ డ్రామా. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా నెల్స‌న్ దిలీప్ కుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, మోహ‌న్ లాల్‌, శివ‌రాజ్ కుమార్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోసించారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ స్వ‌రాలు అందించాడు.

ఆగ‌స్టు 10న వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దులిపేస్తోంది. వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ వసూళ్ల‌ను సొంతం చేసుకుంటూ అరాచ‌కం సృష్టిస్తోంది. ఇక‌పోతే ఈ సినిమాకు అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ ఆయువు ప‌ట్టుగా మారింది. సాధార‌ణ‌మైన సీన్స్ ను కూడా త‌న మ్యూజిక్ తో నెక్స్ట్ లెవ‌ల్ కు తీసుకెళ్లాడు. `హుకుమ్‌` సాంగ్ అయితే ఇంకా అభిమానుల్లో చెవుల్లో మారుమోగుతూనే ఉంది.

అయితే జైల‌ర్ విజ‌యంలో కీల‌క పాత్ర‌ను పోషించిన అనిరుధ్‌.. ఈ సినిమాకు ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడో తెలిస్తే షాకైపోతారు. ఎందుకంటే, అనిరుధ్ కు ఏకంగా రూ. 10 కోట్లు రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌ట‌. ఈ విష‌యం తెలిసి అనిరుధ్ ముందు హీరోలు కూడా వేస్టే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, తమిళంలో పెద్ద హీరోల సినిమా వస్తుందంటే చాలు.. అనిరుధ్ మ్యూజిక్ ఉండాల్సిందే. ఈయ‌న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ స్టార్ల భారీ బడ్జెట్ చిత్రాలను బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ గా ఎలివేట్ చేశాయి. దీంతో ఇండియా వైడ్ గా అనిరుధ్ డిమాండ్ ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం త‌మిళంతో పాటు ప‌లు తెలుగు చిత్రాల‌కు కూడా అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.