కోలీవుడ్ ,టాలీవుడ్లో సూపర్ స్టార్ గా పేరుపొందిన రజనీకాంత్ గురించి తెలియజేయాల్సిన పనిలేదు.. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ధనుష్ ని ప్రేమించి మరి వివాహం చేసుకున్న ఈమె వివాహమై ఇద్దరు కొడుకులు పుట్టాక కొన్ని సంవత్సరాలకు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు.. అయితే రజనీకాంత్ కూతురు ఐశ్వర్య జీవితాన్ని నాశనం చేసి తన భర్త నుంచి విడిపోవడానికి కారణం ఒక స్టార్ హీరోయిన్ అనే వార్తలు కోలీవుడ్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.
అయితే ధనుష్ ,ఐశ్వర్య విడిపోవడానికి ముఖ్య కారణం ఎవరు కాదో హీరోయిన్ అమలాపాల్ నట.. ఈమె వల్లే ధనుష్, ఐశ్వర్య మధ్య ప్రతిరోజు గొడవలు జరిగేవని అవి ఎక్కువ అవ్వడంతో వీరిద్దరూ విడాకులు తీసుకొని ప్రస్తుతం వేరువేరుగా ఉంటున్నట్లు కోలీవుడ్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. అయితే ధనుష్ ఇప్పటికే చాలామంది హీరోయిన్లతో కూడా ఎఫైర్ నడిపాడు అనే టాక్ వినిపిస్తూ ఉంటుంది.. అమలాపాల్ ధనుష్ కాంబినేషన్లో వచ్చిన రఘువరన్ బీటెక్ సినిమా, vip -2 సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి.
అమలాపాల్, ధనుష్ రఘువరన్ బీటెక్ సినిమా చేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య ఎక్కువగా సన్నిహిత్యం ఏర్పడి అది రహస్య ఎఫైర్ వరకు వెళ్లిందట.దీంతో ఐశ్వర్య కు తెలియడంతో వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయని ఆ కారణంగానే ఐశ్వర్య ఈ విషయంలో కాంప్రమైజ్ కాకుండా విడాకులు బాట పట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇలా అమలాపాల్ వల్లే రజనీకాంత్ కూతురు జీవితం సర్వనాశనం అయ్యిందని కోలీవుడ్లో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి మరియు ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.