“నేటి హీరోయిన్స్ కి ..మాకు మధ్య తేడా అదే”.. ఉన్నది ఉన్నట్లు చెప్పేసిన రమ్యకృష్ణ..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా సరే.. రమ్యకృష్ణ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు మిగతా హీరోయిన్స్ అందరూ దిగదుడుపే అని చెప్పాలి. చిట్టి పొట్టి బట్టలు వేసే నేటి కాలం హీరోయిన్స్ ఎంత అల్లాడిస్తున్న సరే తనదైన స్టైల్ లో హీరోయిన్ రమ్యకృష్ణ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . ఏజ్ కు తగ్గట్టు సీనియర్ పాత్రలు పోషిస్తూ ఫోటోషూట్ లో మాత్రం తన బ్యూటీ ని బాగా ఎక్స్పోజ్ చేస్తున్న రమ్యకృష్ణ.. రీసెంట్గా ఓ ప్రముఖ మీడియా ఛానల్ తో ముచ్చటించింది .

ఈ క్రమంలోనే ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేటి కాలం హీరోయిన్స్ కి ఒకప్పటి హీరోయిన్స్ కి మధ్య ఉన్న తేడాను క్లియర్ గా ఉన్నది ఉన్నట్లు చెప్పేసింది . ఈ కాలం హీరోయిన్స్ మీలాగా 20 – 25 ఏళ్ల లైఫ్ టైం ఎందుకు ఉండలేక పోతుంది ..? అంటూ రిపోర్టర్స్ ప్రశ్నించారు . ఈ క్రమంలో రమ్యకృష్ణ మాట్లాడుతూ..” ఈ కాలం హీరోయిన్స్ కి తొందర ఎక్కువ ..ఎంత త్వరగా ఇండస్ట్రీలోకి వస్తున్నారో.. అంతే త్వరగా వెనక్కి వెళ్ళిపోతున్నారు “.

“పైగా మేము ఇన్నాళ్లు కష్టపడి సంపాదించిన క్రేజ్ – ఫేమ్ – మనీ మొత్తం వాళ్ళు ఒకే ఒక సినిమాతో దక్కించుకుంటున్నారు. నెక్స్ట్ సినిమాకి పడిపోతున్నారు . అయితే మా కాలంలో ఓ హీరోయిన్ తప్పు చేసిన సరే.. ఆ తప్పులు సరిదిద్దుకోడానికి టైం ఉండేది.. ఇప్పుడు అక్కడ అంత టైం ఎక్కడుంది.. రావడం పోవడం వెంట వెంటనే జరిగిపోతున్నాయి “అంటూ తనదైన స్టైల్ స్పందించింది రమ్యకృష్ణ . ప్రెసెంట్ ఇవే కామెంట్స్ వైరల్ గా మారాయి..!!