“జాతీయ అవార్డు”తో బన్నీ కి హెడ్ వెయిట్ పెరిగిందా..? అంత మాట అనేసాడు ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో కావాలనే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ ని తొక్కేయలని చూస్తున్నారా..? అంటే అవునని అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. దానికి కారణం లేకపోనూ లేదు . రాక రాక తెలుగు హీరోకి ఒక జాతీయ అవార్డు వస్తే దానిని పట్టుకొని రాద్ధాంతం చేస్తుంది సోషల్ మీడియా . మరి ముఖ్యంగా కొంతమంది మెగా ఫ్యాన్స్ బన్నికి జాతీయ అవార్డు ఎలా ఇస్తారు అని ..? మీసాలు గడ్డాలు పెంచేస్తే ఆ జాతీయ అవార్డు ఇచ్చేస్తారా..? అసలు స్మగ్లర్ పాత్రకు జాతీయ అవార్డు ఇవ్వడం ఏంటి ..? అని బుర్ర తక్కువ వెధవలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు .

మరి కొంతమంది రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు రావాలి అని ..కానీ అది డబ్బులు పెట్టి బన్నీ కొనుక్కున్నాడు అని.. లేనిపోని నిందలు వేస్తున్నారు. దీనంతటికీ కారణం జాతీయ అవార్డుల ఉత్తమ నటుడు కేటగిరీలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కూడా ఆయనకు టఫ్ కాంపిటీషన్ ఇవ్వడమే. నిజానికి ఎన్టీఆర్ – రామ్ చరణ్ లలో ఎవరో ఒకరికి జాతీయ అవార్డు వస్తుందని అంతా అనుకున్నారు . పుష్ప సినిమాకు అసలు జాతీయ అవార్డు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఎవరు ఊహించని విధంగా తెలుగు జనాలు గత 69 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న ఉత్తమ జాతీయ అయినటుడు అవార్డు బన్నీకు రావడం కొందరు జనాలకు విపరీతంగా నచ్చేసిన మరి కొంత మంది జనాలకు మాత్రం బాధగా కనిపిస్తుంది .

అంతేకాదు అసలు బన్ని జాతీయ అవార్డు అందుకోకూడదని ..అతని కి ఆ రైట్ కూడా లేదని ..కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు. కొందరు ఆయన డబ్బు ఇచ్చి అవార్డు కొనుక్కున్నారు అని ..నెగటివ్గా ప్రచారం చేస్తున్నారు . అయితే వీళ్ళందరికీ బన్నీ ఫాన్స్ ఒకటే చెప్తున్నారు. కళ్ళు పెట్టుకొని పుష్ప సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అని.. బన్నీ ఏ రేంజ్ లో కష్టపడ్డారో మీకే అర్థమవుతుందని చెప్పుకు వస్తున్నారు. మరి కొంతమంది జాతీయ అవార్డు వచ్చిన తర్వాత బన్నీ ఇచ్చిన ఇంటర్వ్యూలలో మాట్లాడిన మాటలు బట్టి ఆయనకు మెగా సపోర్ట్ అవసరం లేదని.. మెగా కాంపౌండ్ నుంచి వచ్చే ఎటువంటి బ్యాక్ సపోర్ట్ తో ఆయనకి పనిలేదని చెప్పకనే చెప్పేసినట్లు ప్రచారం చేస్తున్నారు. దీంతో మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండానే ఇంత దూరం వచ్చావా..?బన్నీ అంటూ మెగా ఫాన్స్ మండిపడుతున్నారు. మొత్తానికి ఓ జాతీయ అవార్డు ఇద్దరు కుటుంబాల మధ్య పెద్దగానే చిచ్చు పెట్టింది..!!