పెళ్లి చేసుకోబోతున్న విజయ్ దేవరకొండ.. పోస్ట్ తో క్లారిటీ..!!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఖుషి చిత్రం రేపటి రోజున విడుదల కాబోతోంది. విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్స్ని వేగవంతం చేస్తున్నారు చిత్రబృందం.. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్, టీజర్ ,పోస్టర్స్ ,సాంగ్స్ పాజిటివ్ గానే ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా హడావిడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రతి పోస్ట్ కూడా హాట్ టాపిక్ గా నిలిచేలా ఏదో ఒక పాయింట్ తో హైలైట్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ.

సమంత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కావాల్సినంత పాజిటివ్ వైబ్రేషన్ ని క్రియేట్ చేయడం జరుగుతోంది. తాజాగా విజయ్ దేవరకొండ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలతో మరి కొంత క్యూరియాసిటీని పెంచేశారు.. విజయ్ మరొకరి చేతిలో చేయి పెట్టి ఉన్న ఒక ఫోటోను సైతం సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది… అలాగే ఇలా రాసుకోవడం జరిగింది “చాలా జరుగుతున్నాయి కానీ ఇది నిజంగా ప్రత్యేకమైనది త్వరలోనే ప్రకటిస్తానంటూ”.. తెలియజేయడంతో వైరల్ గా మారుతోంది.

ఇంస్టాగ్రామ్ పోస్ట్ కు విజయ్ వ్యక్తిగత జీవితానికి ఏదైనా సంబంధం ఉందా లేకపోతే ఏదైనా ప్రాజెక్టుకు బ్రాండ్ అంబాసిడర్ అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇన్స్టా స్టోరీ విజయ్ దేవరకొండ ప్రేమ జీవితానికి నిదర్శనం అని కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. లేకపోతే విజయ్ దేవరకొండ వివాహం చేసుకోబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. తన ఇన్స్టాగ్రామ్ ఫోటోలో కూడా అమ్మాయి చేతిలో చెయ్యి పెట్టి ఉంచుతూ ఈమధ్య చాలా జరుగుతున్నాయని తెలియజేయడంతో ఈ పోస్ట్ కు అదే అర్థమని కూడా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఖుషి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.