ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ మహానటి గా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ చేయబోతుందా..? అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు .. ఆ సినిమా మరేదో కాదు గుంటూరు కారం . ప్రెసెంట్ ఇదే న్యూస్ ట్రెండింగ్ లోకి వచ్చింది. గత కొంతకాలంగా కీర్తి సురేష్ సినిమా ఇండస్ట్రీలో ఎలా రాజ్యమేలేస్తుందో మనకు బాగా తెలిసిందే.
అయితే రీసెంట్ గానే ఆమె నటించిన భోళా శంకర్ సినిమా డిజాస్టర్ అయింది . ఈ క్రమంలోనే అసలు ఐటమ్ సాంగ్స్ పై ఇంట్రెస్ట్ లేని కీర్తి సురేష్ సైతం గుంటూరు కారం సినిమా నుండి ఆఫర్ రాగానే యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఎప్పటినుంచో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కీర్తి సురేష్ తో ఐటమ్ సాంగ్ చేయించాలి అని ఆశపడుతున్నారట.
ఫైనల్లీ ఆ కోరిక నెరవేరబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు మహేష్ బాబు కోసమే కీర్తి సురేష్ ఈ డెసిషన్ తీసుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది . మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే అఫీషియల్ అప్డేట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే..!!