పవన్ కళ్యాణ్ ని “అమ్మ నా బూతులు” తిడుతున్న.. మెగా ఫ్యామిలీ రియాక్ట్ కాకపోవడానికి కారణం అదేనా..?

ఈ మధ్యకాలంలో ఏపీ రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా ముందుకెళ్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై బూతుల వర్షం కురిపిస్తున్నారు కొందరు రాజకీయ నాయకులు . మాటకు ముందు ఓ సారి ఆయన మూడు పెళ్లిళ్లు.. మాటకు వెనకాల మరోసారి ఆయన మూడు పెళ్లిళ్లు తీసుకొస్తూ ఆయనను బాగా టార్గెట్ చేస్తున్నారు . కొంతమంది రెచ్చిపోయి ఆయన పరసనల్ విషయాలను సైతం బయటపడుతూ మరింత వల్గర్ ట్రోల్ చేస్తున్నారు . అఫ్ కోర్స్ రాజకీయాలంటే ఇలా దూషించుకోవడం కామన్ .

కానీ ఒకప్పటి రాజకీయాలు వేరు . పర్సనల్ గా ఎవరు వెళ్లే వాళ్ళు కాదు . రాజకీయంగా మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం ..? మీరు అధికారంలోకి వస్తే ఏమిస్తారు..? ఇంతవరకే ఉండేటివి . కానీ ఈ మధ్యకాలంలో పూర్తిగా ట్రెండ్ మారిపోయింది . రాజకీయాల్లో పర్సనల్ విషయాలు తప్పిస్తే అసలు పబ్లిక్ కి యూస్ అయ్యే విషయాలన్నీ మాట్లాడడం లేదు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పై పలువురు రాజకీయ నాయకులు చేస్తున్న కామెంట్స్ హద్దులు మీరిపోతున్నాయి అంటూ బాధపడుతున్నారు .

అంతే కాదు పవన్ కళ్యాణ్ ని ఇలా బూతులు తిడుతున్న సరే మెగాస్టార్ చిరంజీవి కానీ. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఎవరు కాని రెస్పాండ్ అవ్వకపోతూ ఉండడంతో అసలు మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుందో అన్న క్వషన్స్ ..? ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. నాగబాబు తప్పిస్తే మెగా ఫ్యామిలీ నుండి ఎవ్వరు కూడా పవన్ సపోర్ట్ చేస్తూ మాట్లాడడం లేదు . మరీ ముఖ్యంగా రాజకీయాల పరంగా అందరూ దూరంగా ఉంటున్నారు. అయితే దీనికి మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చే ముందే స్ట్రిక్ట్ గా అందరికీ వార్నింగ్ ఇచ్చారట . “రాజకీయాలు అన్నాక ఒక మాట అనడం కామన్ . నన్ను ఏదైనా అంటే మీరు తట్టుకోరు ..ఊరుకోరు ..అది నాకు తెలుసు . కానీ అలా ఏది చేయకూడదు . ఎవరిపై ఎవరు మాట్లాడకూడదు” అంటూ ప్రామిస్ చేయించుకున్నారట. అందుకే పవన్ కళ్యాణ్ ని బూతులు తిడుతున్న సరే మెగా ఫ్యామిలీ ఏ మాత్రం రియాక్ట్ అవ్వకుండా బాధపడుతున్నారని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!