తమ్ముడు వరుణ్ కు అలాంటి సలహా ఇచ్చిన అన్న చరణ్.. లావణ్య ఏం చేసిందో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది మెగా ట్యాగ్ ను ఉపయోగించుకొని ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు . అయితే అందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ . కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు తాను నటించిన సినిమాలు మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ జోనర్ లో అభిమానులను అట్రాక్ట్ చేస్తూ వచ్చాడు . రీసెంట్గా వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా గాండీవ దారి అర్జున . ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంట్రెస్టింగ్విషయాన్నీ బయట పెట్టాడు వరుణ్ తేజ్ . తన అన్న చరణ్ తనకు ఎన్నో సలహాలు ఇచ్చాడని .. అన్నిట్లోకి ఓ ప్రత్యేకమైన సలహాను బయటపెట్టాడు. ఈ క్రమంలోని వరుణ్ మాట్లాడుతూ ” సినిమా ఇండస్ట్రీలోకి నటుడుగా వచ్చాక ఎంతో ప్రెజర్స్ ఉంటాయి. కుటుంబం దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి నానా విధాలుగా ప్రజర్స్ పెరుగుతూ ఉంటాయి . కానీ నాకు అటువంటి ప్రెజర్ లేదు.. ఐ యాం సో లక్కీ.. నా అన్న చరణ్ కూడా నాకు ఎన్నోసార్లు సలహా ఇచ్చారు. మరీ ముఖ్యంగా పెద్దపెద్ద ప్రొడ్యూసర్స్ మనల్ని రిస్ట్రిక్టెడ్ జోన్ నుంచి బయటికి తెప్పించడానికి ప్రయత్నాలు చేస్తారని ..అలాంటి ప్రొడ్యూసర్స్ ని నమ్మద్దు అని నటుడుగా నువ్వు ఏంటో నీకు తెలుసు ..నీ బాడీకి ఎలాంటి కథ సూట్ అవుతుందో నీకు బాగా తెలుసు ..అదే విధంగా నటించమంటూ సజెస్ట్ చేశారట”.

” మిగతా డైరెక్టర్ లు.. ప్రొడ్యూసర్స్ ఎంతమంది వచ్చినా ఓ నటుడిగా నువ్వేంటో నీకు తెలిసినప్పుడు వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారట . అంతేకాదు ఇదే సలహా పై లావణ్య సైతం పాజిటివ్ గా రిప్లై ఇచ్చిందట”. చరణ్ ఇచ్చిన సలహా ది బెస్ట్ అదే ఫాలో అవ్వు.. నటుడుగా నువ్వేంటో ప్రూవ్ చేసుకో ..అంటూ వరుణ్ ని ప్రోత్సహించిందట . ప్రజెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!