“నోరు మూసుకో”..నీహారిక కామెంట్ కు.. బావ సాయి ధరమ్ తేజ్ స్ట్రాంగ్ కౌంటర్..!!

ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో మనకు బాగా తెలిసిందే. మరీ ముఖ్యంగా మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకున్నప్పటినుంచి పొద్దుకి 10 వార్తలైనా సరే నిహారిక గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి . కాగా రీసెంట్గా సాయిధరమ్ తేజ్ ఓ ప్రైవేట్ సాంగ్ లో నటించాడు అన్న విషయం తెలిసిందే . సత్య అనే ప్రైవేట్ సాంగ్లో నటించి మెప్పించాడు సాయిధరమ్ తేజ్ .

ఈ సాంగ్ డైరెక్ట్ చేసింది ఎవరో కాదు సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ. ఈ సాంగ్ యూట్యూబ్లో మిలియన్స్ కొద్ది వ్యూస్ దక్కించుకుంటుంది. అయితే ఈ సాంగ్ అప్డేట్ ఇస్తూ సాయిధరమ్ తేజ పోస్ట్ పెట్టాడు . ఆ పోస్ట్ కి రిప్లై ఇస్తూ నిహారిక ..”ఈ పాట చూడడానికి ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను ” అంటూ కామెంట్ చేసింది . నిహారిక ఇచ్చిన రిప్లైకి సాయి ధరంతేజ్ పెట్టిన పోస్ట్ కి ఏమాత్రం సంబంధంలేని విధంగా ఓ నెటిజన్ నిహారిక పర్సనల్ లైఫ్ టచ్ చేశారు .

“ఈ ధ్యాస మీ కుటుంబం పై పెట్టి ఉంటే బాగుండేది ” అంటూ పర్సనల్ లైఫ్ ని టచ్ చేసాడు. దీంతో కోపంతో రగిలిపోయిన సాయి ధరమ్ తేజ్ “నోరు మూసుకొని ముందు కామెంట్ డిలీట్ చేయండి”..అంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు . ప్రెసెంట్ ఇదే కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!