హీరోయిన్ రెజీనా కూడా క్యాస్టింగ్ కౌచ్ బారినపడిందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రెజీనా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ వంటి భాషలలో కూడా నటించి బాగానే ఆకట్టుకుంది.. మొదట్లో వరస సినిమా అవకాశాలు అందుకోవడంతో స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందనుకున్నారు. కానీ మీడియం రేంజ్ హీరోయిన్ లానే మిగిలిపోయింది. ఈ మధ్యకాలంలో అసలు సినిమాలలోనే నటించలేదు.. చాలా తక్కువగా నటిస్తోంది. పలు చిత్రాలలో నెగిటివ్ పాత్రలలో కూడా నటించింది రెజీనా. ఇలా ఎలాంటి పాత్రలో నైనా సరే మెప్పించిన ఈమె క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంది అనే వార్తలు వినిపిస్తున్నాయి..

Regina Cassandra Hot Pose In Sleeveless Tops- She Is Damn Hot guys.. - DESI  GIRLZ

ఈమధ్య సినిమా అవకాశాలు తగ్గిన తాజాగా ఒక ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ తాను క్యాస్టింగ్ కౌచ్ కి గురయ్యానని చెప్పడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది.. రెజీనా చిన్న వయసులోనే 17 సంవత్సరాలకే తన సినీ కెరియర్ ని ప్రారంభించిందట ..ఆ సమయంలో తనకు ఊహించని సంఘటనలు కూడా చాలానే ఎదురయ్యాయని తెలిపింది.. సినిమాలలో అవకాశం అందుకోవడం కోసం కొందరిని సంప్రదించగా వారిలో ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి అవకాశాలు రావాలి అంటే అడ్జస్ట్ కావాలి అని చెప్పారట..

అయితే ముందు అడ్జస్ట్ కి ఓకే చెబితే ఆ తర్వాత వెంటనే షూటింగ్ కి వెళ్లిపోవచ్చని చెప్పారట..ఆ మాట విని దాదాపుగా సంవత్సరాలు అయిందని తెలిపింది.. అప్పటి వయసు కేవలం 18 సంవత్సరాలు అయితే అతని మాటలు ముందు తనకు అసలు అర్థం కాలేదని రెమ్యూనరేషన్ గురించి అడుగుతున్నారేమో అనుకున్నాను.. దీంతో మా మేనేజర్ తో మాట్లాడి చెబుతానని ఫోన్ పెట్టేసిందట.. మేనేజర్ తో మాట్లాడిన తర్వాత తనకు అసలు విషయం తెలిసిందని తెలుపుతోంది రెజీనా.. అయితే ఇలా తనకు మొదటి అనుభవం ఇలా ఎదురయ్యిందని మళ్లీ ఆ తర్వాత అలాంటి సంఘటన ఎదురు కాలేదని చెబుతోంది.