ఆర్ ఆర్ ఆర్ కంటే ముందే తారక్-చరణ్ కలిసి నటించాల్సిన సినిమా ఏంటో తెలుసా..? జస్ట్ మిస్..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో భళే సెట్ అవుతూ ఉంటాయి. అయితే ఒక్కసారి ఫిక్సయిన కొంబో మరోసారి ఫిక్స్ అవ్వాలంటే నానా దంటాలు పడుతూ ఉండాలి. అలాంటి ఒక క్రేజీ కాంబోనే తారక్ – చరణ్ . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోలుగా పేరు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ – యంగ్ టైగర్ గా పాపులారిటీ దక్కించుకున్న తారక్.. రీసెంట్గా కలిసిన నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ .

ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును ఎలా తిరగరాసిందో.. ఎన్ని అవార్డులను కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఇండియన్ అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆస్కార్ అవార్డును సైతం తీసుకొచ్చింది ఈ సినిమానే. అయితే ఈ క్రేజీ కాంబో ముందే సెట్ అవ్వాల్సి ఉండిందట. కానీ కొన్ని కారణాలవల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది తారక్. ఆ సినిమా ఏంటో కాదు ఎవడు .

ఎస్ బృందావనం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తారక్ కు అందించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . చరణ్ – ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోలుగా కనిపిస్తారు. అయితే బన్నీ నీ అనుకున్న పాత్ర కోసం ముందుగా వంశీ పైడిపల్లి ని తారక్ అనుకున్నారట . అప్పటికే వేరే సినిమాతో బిజీగా ఉన్న తారక్ ఈరోల్ ను వదులుకోవాల్సి వచ్చింది . ఒకవేళ తారక అప్పుడే ఒప్పుకొని ఉంటే ఈ కాంబో అప్పుడే సెట్ అయిపోయిండేది. జస్ట్ మిస్ అయింది అంతే .. ఫైనల్లీ మళ్ళీ ఆర్ఆర్ఆర్ సినిమాతో కలిసి నటించారు. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది..!!