ధమాకా సినిమాని చేతులారా వదులుకుని.. శ్రీలీల కు లైఫ్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ ఈమె..ఎంత దురదృష్టవంతురాలు అంటే..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే యంగ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. మరీ ముఖ్యంగా ఇప్పటివరకు అమ్ముడు నటించింది రెండు అంటే రెండు సినిమాలే . అయినప్పటికీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం శ్రీలీల ఏకంగా 10 ఆఫర్లు చేత్తో పట్టుకొని స్టార్ బ్యూటిగా రాజ్యమేలుస్తుంది. అయితే దీనంతటికి కారణం ధమాకా సినిమా అని మనం మర్చిపోకూడదు.

ఎస్ అప్పటికే పెళ్లి సందడి సినిమాలో శ్రీలీల మెరిసిన ఆ సినిమా యావరేజ్ గానే మారింది . అయితే ధమాకా సినిమాతోనే ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిన శ్రీ లీల .. ఆ తరువాత పాన్ ఇండియా హీరోయిన్గా కూడా గుర్తింపు సంపాదించుకుంది . కాగా ఇలాంటి క్రమంలోనే ధమాకా సినిమాలో ఆఫర్ వచ్చినా సరే చేతులారా మిస్ చేసుకున్న హీరోయిన్ పేరుని ట్రెండ్ చేస్తున్నారు శ్రీ లీల అభిమానులు.

ఆమె మరి ఎవరో కాదు పూజ హెగ్డే . ఎస్ ఈ సినిమాలో మొదటగా హీరోయిన్ గా అనుకున్నింది పూజ హెగ్డే ని అట. ఆమె కోసం ట్రై చేసినా.. ఆమె రవితేజ అన్న కారణంతో ఈ సినిమాను మిస్ చేసుకుందట . అప్పటికే వరుస ప్లాప్ లో ఉన్న రవితేజ ఈ సినిమాతో ఏం హిట్టు కొడతాడు అని రిజెక్ట్ చేసింది . అయితే ఎనూహ్యంగా శ్రీలీలా ఈ సినిమాని ఒప్పుకుని ఆమె ఖాతాలో ఏకంగా 10 ఆఫర్లు వేసుకునింది. పూజ హెగ్డే ఖాతాలో ఉన్న ఆఫర్లు కూడా పోయాయి. దీన్నే దురదృష్టం అంటారు అంటూ పూజను ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!