మరో పాన్ ఇండియా సినిమాకి కమిట్ అయిన అల్లు అర్జున్ కూతురు.. ఈసారి ఏకంగా ఆ స్టార్ హీరోతోనే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పుడే నెక్స్ట్ జనరేషన్ కి సంబంధించిన పిల్లలు బెర్తులు కన్ఫామ్ చేసుకుంటున్నారు . మరికొందరు ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో ఆఫర్స్ పట్టేస్తూ ఇప్పటినుంచే హ్యుజ్ రేంజ్ పాపులారిటీ పబ్లిసిటీతో దూసుకుపోతున్నారు . ఆలిస్టులోకే వస్తుంది క్యూట్ లిటిల్ అల్లు ప్రిన్సెస్ అల్లు అర్హ . టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. చాలా క్యూట్ గా ..చాలా స్మైలీగా ..హ్యూజ్ పబ్లిసిటీ.. పాపులారిటితో సోషల్ మీడియాలో నాన్నకు మించిన ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న ఈ క్యూటీ రీసెంట్ గానే శాకుంతలం సినిమాతో అభిమానులను మెప్పించింది.

ఈ సినిమాలో సమంత – దేవ్ మోహన్ నటనపరంగా ఎలా ఉన్నా కానీ అల్లు అర్హ చెప్పిన క్యూట్ క్యూట్ డైలాగ్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంది . అందుకే సినిమా ఫ్లాప్ అయినా సరే బన్నీ ఫాన్స్ ఈ సినిమాను ఏకంగా మూడే సార్లు చూసి సినిమాకి కాస్తో కూస్తో కలెక్షన్స్ రాబట్టగలిగారు . అయితే అల్లు అర్హ మరో పాన్ ఇండియా సినిమాకి సైన్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఆ సినిమా మరేదో కాదు ఎన్టీఆర్ – కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర. ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ట్రెండింగ్ లోకి వచ్చింది .

ఎన్టీఆర్ దేవర సినిమాలో అర్హా చైల్డ్ యాక్టర్స్ పాత్రలో కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అంతేకాదు జాన్వి కపూర్ చిన్నప్పటి రోల్ కోసం అల్లు అర్హను చూస్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఈ క్రమంలోనే ఫస్ట్ సినిమానే కాదు సెకండ్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో చూస్ చేసుకుంది అల్లు అర్హ అంటూ అల్లు ఫాన్స్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. అంతేకాదు అల్లు అర్జున్ -తారక్ చాలా చాలా క్లోజ్ గా ఉంటారు . బావ బావ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు . అలాంటి హీరో సినిమాలో తన కూతురు అల్లు అర్హ నటిస్తుండటం ఫ్యాన్స్ కి ఇంకా ఉత్సాహం కలుగుతుంది. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!