“చచ్చేంత భయం” అంటూ “చంద్రముఖి” సినిమా ని మిస్ చేసుకున్న ఆ మెగా హీరో ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవరు గెస్ చేయలేరు అంటుంటారు సినీ ప్రముఖులు . నిజంగా అది నిజం అని చెప్పాలి . మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా మారిన హీరోలు కూడా కొన్ని కొన్ని సార్లు పప్పులో కాలేస్తూ ఉంటారు . అయితే అలానే ఓ సినిమా విషయంలో పప్పులో కాలేసి ఇప్పటికీ బాధపడుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి . ఎస్ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలచిన సినిమా చంద్రముఖి . పి వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించగ జ్యోతిక – ప్రభు – సోనూసూద్ – నాజర్ కీలక పాత్రలు పోషించి సినిమాకి హైలైట్ గా నిలిచారు .

ఈ సినిమా 2005లో రిలీజ్ అయ్యి ఎన్ని రికార్డులను తిరగరాసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పెట్టిన దానికి ఏకంగా ఐదు రెట్లు లాభాలు తీసుకొచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇండస్ట్రీ సెన్సేషనల్ హర్రర్ హిట్టుగా నిలిచిపోయింది . హర్రర్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్గా నిలిచింది చంద్రముఖి . అంతెందుకు ఇప్పటికీ ఈ సినిమా పేరు చెప్తే కొందరు భయపడి పోతారు. అంతలా జనాల వెన్నులో వణుకు పుట్టించింది . ఈ సినిమా మలయాళం లో మోహన్ లాల్ సురేషు గోపి నటించిన “మణిచిత్రతాఝు” ఇది రీమిక్స్.

ఇదే కథను “ఆప్తమిత్ర” అనే పేరుతో కన్నడలో కూడా తీశారు . కన్నడలో కూడా మంచి విజయం అందుకుంది. అంతే కాదు ఈ సినిమా రీమేక్ చేస్తున్న టైంలో ఈ సినిమాలో హీరోగా మెగాస్టార్ చిరంజీవిని అనుకున్నారట . ఆయన అయితే ఈ పాత్రికి బాగుంటుంది అని సినిమాకి మరింత హైపోస్తుందని భావించారట . అయితే మెగాస్టార్ చిరంజీవికి ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకం లేని కారణంగా ఇలాంటి సినిమాలు తీస్తే ఎక్కడ తనని జనాలు యాక్సెప్ట్ చేయరో అన్న భయంతో ఈ సినిమా రిజెక్ట్ చేశారట . దీంతో ఈ సినిమాని మిస్ చేసుకున్నాడు చిరంజీవి . దీంతో డైరెక్టర్ వాసు నేరుగా రజనీకాంత్ వద్దకు వెళ్లి కథ చెప్పాడట. ఆయనకు బాగా నచ్చడంతో వెంటనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట .