ఆ పాత్ర సమంత సినిమా జీవితాన్ని నాశనం చేయనుందా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్,, హిందీ వంటి భారతీయ భాషా చిత్రాలలోనూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు చెన్నై స్టోరీస్ సినిమాతో హాలీవుడ్‌లో అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా హిట్ అయితే సామ్ ప్రియాంక వలె గ్లోబల్ స్టార్ అవుతుంది. నిజానికి సమంత చివరగా నటించిన శాకుంతలం మూవీ ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. దీని నుంచి సమంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇలాంటి సమయంలో ఆమె చేస్తున్న ఒక పాత్ర ఇప్పుడు అభిమానులను షాక్‌లో పడేసింది.

ప్రస్తుతం సామ్‌ ఖుషి మూవీ, సీటాడెల్ వెబ్‌సిరీస్‌లో యాక్ట్ చేస్తోంది. సీటాడెల్ వెబ్‌సిరీస్‌లో వరుణ్ ధావన్ మెయిన్ లీడ్ చేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా ముగియడానికి వస్తోంది. త్వరలోనే ఇది ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపథ్యంలోనే ఈ సిరీస్‌కి సంబంధించిన ఓ సెన్సేషనల్ న్యూస్ బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సిరీస్‌కు ప్రియాంక చోప్రా లీడ్ రోల్ చేసిన సిటాడేల్‌కు లింకు ఉందన్న సంగతి విధితమే.

అయితే ఎవరికీ తెలియని విషయం ఏంటంటే సమంత చేస్తున్న ఈ సిరీస్ ప్రియాంక చోప్రా సిరీస్‌కి ఫ్రీక్వల్ గా వస్తోందట. ఇంగ్లీష్ వెర్షన్ 5వ ఎపిసోడ్‌లో ప్రియాంక చోప్రా తన తండ్రి పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ తో లింక్ చేస్తూ ఇండియన్ వెర్షన్‌లో వరుణ్ ధావన్ వయసు రివీల్ చేస్తారట. ఇదొక్కటే కాదు సమంత, వరుణ్ ధావన్‌లు ప్రియాంక చోప్రాకు పేరెంట్స్ గా కనిపిస్తారట. ప్రియాంక చోప్రా కి సమంత తల్లి పాత్ర చేస్తుందని బాలీవుడ్ మీడియా కొడై కోస్తోంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇలాంటి రోల్స్ చేస్తే భవిష్యత్తులో కూడా హీరోయిన్ అవకాశం బదులు అన్ని ఇలాంటివే వస్తాయని వారు ఆందోళన చెందుతున్నారు. కెరీర్ కూడా నాశనం అవుతుందని అంటున్నారు. కాగా ఏదో కొద్దిసేపు సమంత ఈ పాత్రలో కనిపించడం వల్ల పోయేదేమీ లేదు అని తెలుస్తోంది.