ఎన్టీఆర్‌కు జంటగా ప్రభాస్ బ్యూటీ.. ఈసారి బాక్సులు బద్దలు అవ్వాల్సిందేగా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో తన 30వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ తర్వాత కొరటాల చాలా గ్యాప్ తీసుకుని మరి ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఏప్రిల్ తొలి వారంలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవగా ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫా అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.

Jr. NTR and Janhvi Kapoor's 'NTR 30' receives recognition from renowned VFX  and action experts - The Daily Guardian

సముద్రపు మాఫియా కథతో వస్తున్న ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నిల్ సినిమా షూటింగ్లో బిజీ అవ్వ‌నున్నాడు.. అంతకన్నా ముందే హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నాడు అని తెలుస్తుంది. ఇక ఎప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ మీద ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది.ఇప్పుడు తాజాగా మరో కొత్త రూమర్ ఒకటి వైరల్ గా మారింది.

Jr NTR sports fierce look in Prashanth Neel's NTR 31 - India Today

ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ నటించబోతుందంటూ పలు వార్తలు షికార్లు చేస్తున్నాయి. గతంలో అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోణె నటించబోతుందని టాక్ కూడా నడిచింది. ఇప్పుడు ఎన్టీఆర్ కి జంటగా శ్రద్ధ కపూర్ హీరోయిన్‌గా ఫిక్స్ అయిందంటూ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. నిజానికి ప్రశాంత్‌ నీల్ ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి నటీనటులను ఎంపిక చేయలేదు.. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో సలార్‌ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.

Shraddha Kapoor Ram Charan NTR RRR Shraddha Kapoor Archives

కాకపోతే ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాలో హీరోయిన్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. అందుకే ఆ పాత్రలో ఓ స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కోసం ఇప్పటివరకు ఎవరూ చేయని పవర్ఫుల్ కథను రెడీ చేశారట.. ఆ స్టోరీ కూడా ఇండియా పాక్ బోర్డర్ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కబోతుందని తెలుస్తుంది.

Share post:

Latest