అటు నిర్మాతలకు ఇటు ప్రభాస్ కు హ్యాండ్ ఇచ్చిన డైరెక్టర్.. ఏమైందంటే..?

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ఈయన ఇక అప్పటినుంచి అన్ని పాన్ ఇండియా చిత్రాలే చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. ఇకపోతే ఈయనతో సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద నిర్మాతలు కూడా ముందుకు వస్తున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే మైత్రి మూవీ మేకర్స్ కూడా ప్రభాస్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నారు.. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడానికి రెడీ అయ్యి దర్శకుడిని కూడా రంగంలోకి దింపడం జరిగింది.

Prabhas on Radhe Shyam's failure: 'Maybe we missed something in script' -  Hindustan Times

మరి ముఖ్యంగా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా దర్శకత్వం వహించిన సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ తో ఒక సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రభాస్ కి ఏకంగా రూ.75 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. మరొకవైపు దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ కూడా అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఎలాగైనా సరే వచ్చే ఏడాది ఈ సినిమా మొదలు పెట్టాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టు కాస్త క్యాన్సిల్ అయ్యేలా ఉంది అనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి.

Mythri spending a bomb for Prabhas' Project

సిద్ధార్థ ఆనంద్ అటు నిర్మాతలకు, ఇటు ప్రభాస్ కి హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే పఠాన్ సక్సెస్ తర్వాత ఫైటర్ సినిమా చేస్తున్నాడు సిద్ధార్థ ఆనంద్ . ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఈ ఏడాది ఆఖరి అవుతుంది. దీని తర్వాత షారుక్ ఖాన్ సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో ఒక మల్టీ స్టార్లర్ చిత్రమైన పఠాన్ వర్సెస్ టైగర్ మూవీ స్క్రిప్ట్ కంప్లీట్ చేయాల్సి ఉంది .

Prabhas and Siddharth Anand's film on hold due to date issues, future  uncertain: Report : Bollywood News - Bollywood Hungamaమరొకవైపు వార్ 2 మూవీ అవకాశాన్ని కూడా సిద్ధార్థ ఆనంద్ వదులుకున్నాడు . వార్ మూవీ సిద్ధార్థ దర్శకత్వంలో రాగా ఇప్పుడు దానికి సీక్వెల్ అయాన్ ముఖర్జీ చేస్తున్నారు. ఇలా వరుసగా రెండు బాలీవుడ్ చిత్రాలు చేస్తున్న నేపథ్యంలో ప్రభాస్ మూవీ కోసం మైత్రి నిర్మాత నుంచి తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేసారట. టైం చూసుకొని ఇంకెప్పుడైనా సినిమా చేస్తానని చెప్పారట . మొత్తానికి అయితే ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్లే అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Latest