విష్ణుకు బీజేపీ షోకాజ్..ఇంకా టీడీపీలోకి లైన్ క్లియర్.!

ఏపీ బీజేపీలో రెండు గ్రూపులు ఉన్న విషయం తెలిసిందే. ఒక గ్రూపు వైసీపీకి సపోర్ట్ చేస్తుంటే..మరొక గ్రూపు టి‌డి‌పికి సపోర్ట్ చేస్తున్నారు..అందులో ఎలాంటి డౌట్ లేదు..పైగా కేంద్రంలో అధికారంలో ఉంటూ..రాష్ట్రానికి ఏమి చేయడం లేదనే కోపం ఏపీ ప్రజల్లో ఉంది.అందుకే బి‌జే‌పిని ఆదరించడం లేదు. దీని వల్ల బి‌జే‌పికి ఒక్క సీటు గెలుచుకునే బలం లేదు..ఒక్క శాతం ఓట్లు రావడం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేనలతో పొత్తు ఉంటే కొంతమేర గెలిచే అవకాశాలు ఉంటాయని..బి‌జే‌పిలో ఉన్న టి‌డి‌పి అనుకూల నేతలు అనుకుంటున్నారు.

అందుకే టి‌డి‌పితో పొత్తు ఉండాలని కోరుకుంటున్నారు. కానీ బి‌జే‌పిలో వైసీపీకి అనుకూలంగా ఉన్నవారు మాత్రం టి‌డి‌పితో పొత్తు ఉండదని, అలాగే జనసేనని టి‌డి‌పికి దగ్గర అవ్వనివ్వకుండా చూసి..ఓట్లు చీలిపోయేలా చేసి మళ్ళీ వైసీపీకి లాభం జరిగేలా చూడాలని చూస్తున్నారు. కానీ ఇటు టి‌డి‌పికి అనుకూలంగా ఉన్న వారు మాత్రం పొత్తు కోసం చూస్తున్నారు. ఈ క్రమంలోనే మొదట నుంచి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న బి‌జే‌పి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్  రాజు టి‌డి‌పితో పొత్తు కోరుకుంటున్నారు.

2014లో ఈయన టి‌డి‌పితో పొత్తులో విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సారి పొత్తు ఉంటే ఆ సీటులో పోటీ చేసి గెలవాలని చూస్తున్నారు. అందుకే టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి పొత్తు ఉంటుందని ఆయన చెబుతూ వస్తున్నారు. కానీ బి‌జే‌పిలో వైసీపీకి అనుకూలంగా ఉన్నవారు మాత్రం పొత్తు ప్రసక్తే లేదని అంటున్నారు.

ఈ క్రమంలోనే పొత్తు గురించి మాట్లాడుతున్న విష్ణుకు..అధిష్టానం నుంచి షోకాజ్ నోటీసు వచ్చేలా చేశారు. పొత్తుపై మాట్లాడుతున్న విష్ణుని ఎందుకు సస్పెండ్ చేయకూడదో వివరణ ఇవ్వాలని కోరారు. షోకాజ్ నోటీసు నేపథ్యంలో విష్ణు..ఇంకా బి‌జే‌పికి గుడ్ బై చెప్పి టి‌డి‌పిలో చేరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపో మాపో ఆయన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.