బాలయ్య 109వ సినిమా ఎవరితో.. ఎవరు ఊహించిన విధంగా వస్తున్నాడా..!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం జట్ స్పీడ్‌లో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.. అఖండతో మొదలుపెట్టిన తన విజయ యాత్ర ఈ సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డితో మరో లెవల్ కు తీసుకువెళ్లాడు.. అదే విధంగా వరుస క్రేజీ దర్శకులతో సినిమాలు చేస్తూ తన సినిమాల అంచనాలను పెంచేస్తున్నాడు. అదేవిధంగా ఇటు సినిమాలతో పాటు అటు బుల్లితెరపై కూడా సూపర్ జోష్‌లో దూసుకుపోతున్నాడు.

Veera Simha Reddy' Twitter review: 'Fun to watch,' say Nandamuri  Balakrishna fans - BusinessToday

ఇప్పటికే అన్ స్టాపబుల్ షోనీ విజయవంతంగా రెండు సీజన్లను కంప్లీట్ చేశాడు. త్వరలోనే మూడో సీజన్ కూడా రాబోతుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న తన 108వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఇదే సమయంలో బాలయ్య త‌న‌ తర్వాత సినిమా ఎవరితో అనేది ఇంకా ఖరారు కాలేదు. దాంతో బాలయ్య 109వ సినిమా ఎవరితో ఉంటుంది అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

NBK 108: Nandamuri Balakrishna's project with Anil Ravipudi kicks off with  an official ceremony; pics inside

వచ్చే నెలలో బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయన తరువాత సినిమాపై ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉందో లేదో చూడాలి. అదే సమయంలో తన 109వ సినిమాకు సంబంధించి టాలీవుడ్ లో ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి.. మరోసారి బాలయ్య తన ఆస్థాన దర్శకుడైన బోయపాటి శ్రీను తో మరో సినిమా చేయబోతున్నాడని.. అది కూడా అఖండ2 అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Balakrishna and Boyapati film hot in Trade

అదే సమయంలో మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో పొలిటికల్ కథ కూడా ఒక‌టి పరిశీలనలో ఉందనే మాట మరోవైపు వినిపిస్తుంది.. ఈ విషయంపై స్పష్టత రావడానికి మరి కొంత సమయం పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతానికి బాలయ్య అనిల్ రావిపూడి సినిమాకి సంబంధించి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. బాలయ్య తన తర్వాత సినిమా ఏ దర్శకుడు తో చేస్తారనేది చూడాలి.

Share post:

Latest