అద్గది..వర్మ అంటే ఇలానే ఉండాలి.. ఓపెన్ గానే కిరవాణిని ఆ విషయం గురించి అడిగేసాడుగా..!!

సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్షీయల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వివాదస్పద దర్శకుడు అని.. కాంట్రవర్షియల్ డైరెక్టర్ అని .. తిక్కలోడు అని .. మెంటలోడు అని .. రకరకాలుగా పిలుస్తూ ఉంటారు . కానీ ఎవరు ఎలా పిలిచినా సరే ఆర్జీవి అలాంటివి ఏమీ పట్టించుకోడు . తను నమ్మిన సూక్తులను తూచా తప్పకుండా పాటించే వర్మ ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నెంబర్ వన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే.

రీసెంట్గా రాంగోపాల్ వర్మ లెజెండ్రీ సంగీత దర్శకులు కీరవాణిని ఇంటర్వ్యూ చేశారు . ప్రస్తుతం ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరి కాంబినేషన్ల క్షణక్షణం వంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఇంటర్వ్యూలో వర్మ ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగును ఆస్కార్ దక్కడంపై సూటిగా ప్రశ్నించారు . చాలామంది అనుకున్నట్టు నాటునాటు సాంగ్ ఇంకెవరైనా మ్యూజిక్ డైరెక్టర్ చేసి ఉంటే దానికి ఆస్కార్ దక్కుండేది కాదు ఏమో అన్న ప్రశ్న కూడా డైరెక్ట్ గా అడిగేశారు .

అంతేకాదు నాటు నాటు సాంగ్ మీ కెరియర్ లో టాప్ 100 సాంగ్స్ లు అయినా ఉంటుందా..? అని వర్మ సూటిగా ప్రశ్నించాడు . మరి కీరవాణి దానికి ఎలాంటి సమాధానం ఇచ్చారో చూడాలంటే కంప్లీట్ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యే వరకు ఆగాల్సిందే. ఆర్ఆర్ఆర్ చిత్రం అనేక అంతర్జాతీయ అవార్డులు కొల్లగొట్టిన విషయం తెలిసిందే . ఈ క్రమంలోని వర్మ సైతం ఆర్ఆర్ఆర్ ను పొగుడుతూ ఎన్నో ట్వీట్స్ చేసారు. రాజమౌళి ను వర్మ ఏ రేంజ్ లో పొగిడేసారో ప్రత్యేకంగా చెప్పాలా.. కానీ నాటు నాటు సాంగుకు ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు చాలా మంది ఆర్ఆర్ఆర్ సినిమాను ట్రోల్ చేశారు ,

నిజంగా కీరవాణికి అంత సత్తా ఉందా..? నాటు నాటు పాట అంత బాగా ఉందా..? ఆస్కార్ అందుకునే అర్హత ఉందా..? అంత స్టామినా ఉందా..? అంటూ ట్రోల్ చేశారు . వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగానే కీరవాణి ఆన్సర్ ఉంటుంది అంటూ జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

 

Share post:

Latest