రెమ్యునరేషన్ పెంచేసిన యాంకర్ సుమ.. అవసరమా అంటూ నెటిజన్లు ట్రోలింగ్!

 

ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టీవీ షోలో, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో, సెలబ్రిటీ టాక్ షోలో ఇలా ప్రతీ ఒక్క చోట సుమ కనపడుతూనే ఉంటుంది. తన మాటలతో, పంచులతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ, అల్లరిస్తూ ఉంటుంది సుమ. సుమ కాకుండా మరెవరైనా హోస్ట్ చేస్తే ఆ షో అనుకునంత రేంజ్‌కి వెళ్లడం కష్టమే అని చెప్పాలి. అందుకే సుమ డేట్స్‌కి తగ్గట్లుగా స్టార్ హీరోలు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని ప్లాన్ చేసుకుంటుంటారు. దాని బట్టి చూస్తే సుమకి ఉన్న క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం అవుతుంది.

అయితే చిన్న సినిమా హీరోలు తమ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సుమని యాంకర్‌గా పెట్టేంత బడ్జెట్ లేకపోయినప్పటికి ఏదో ఒక రకంగా సుమని తమ సినిమాలో భాగస్వామ్యం చేయాలని ప్రయత్నిస్తుంటారు. అలాంటి సుమ తన రెమ్యునరేషన్ ఎపటికప్పుడు తన క్రేజ్ ని బట్టి పెంచుకుంటూ పోతుంది అని ఇండస్ట్రీ లో ప్రచారం జరుగుతుంది. ఒకప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి లక్ష రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న సుమ ఇప్పుడు మాత్రం విపరీతంగా పెంచేసిందట.

బుల్లితెర షోలతో పోలిస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సుమ తన రెమ్యునరేషన్ ఎక్కువగా మొత్తంలో తీసుకుంటుందట. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కాస్త రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా లైవ్‌లో వచ్చిన ప్రతీ ఒక్కరిని పలకరిస్తూ ఈవెంట్స్ ని చురుగ్గా ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి సుమ ఎక్కువ మొత్తంలో పారితోషికం తీసుకోవడంలో తప్పేమీ లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం పదేపదే పారితోషికం పెంచడం అవసరమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే దాదాపు 20 ఏళ్ల నుంచి ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంది సుమ. ఇంకో పదేళ్ల వరకూ ఆమె పోస్ట్‌కి ఎలాంటి డోకా ఉండదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

 

Share post:

Latest