పెళ్లైన ఆంటీతో ప్రేమాయణం.. బ్రహ్మాజీ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా..? వీరికి పెళ్లి చేసింది ఆ స్టార్ డైరెక్టరే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్న బ్రహ్మజీ పేరు చెప్తే వచ్చే నవ్వు ..ఆ స్క్రీన్ ఆపీరియన్స్ ప్రత్యేకమైనవి అని చెప్పాలి. కేవలం సినిమాలోనే కాదు రియాలిటీ షోస్ లో కూడా తనదైన స్టైల్ లో మాట్లాడుతూ ఫన్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు.. మరి ముఖ్యంగా స్క్రీన్ పై సుమ – బ్రహ్మాజీ కనిపిస్తే చాలు నవ్వులు ఎలా పూస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తన భార్య శాశ్వితతో ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న “అలా మొదలైంది” అనే షోకి గెస్ట్లుగా వచ్చారు.

మనకు తెలిసిందే కమిడియన్ వెన్నెల కిషోర్ ఈ షో ను హోస్ట్ చేస్తున్నారు . ప్రముఖు కపుల్స్ ను ఈ షో కి ఇన్వైట్ చేసి వాళ్ళ పర్సనల్ విషయాలను అభిమానులకు తెలియజేస్తుంది . ఈ క్రమంలోని రీసెంట్గా ఈ షోకి బ్రహ్మాజీ ఆయన భారీ శాశ్విత అటెండ్ అయ్యాడు . బ్రహ్మాజీ తన భార్య శాశ్వతకు ఎలా ప్రపోజ్ చేసాడో చెప్పుకు వచ్చాడు. ” ఒకవైపు మూన్ లైట్ .. మరో వైపు సన్ లైట్ హై స్పీడ్ లో శాశ్విత దగ్గరకు అలా వెళ్లి ఐ లవ్ యు చెప్పాను ..అంతేనా ఆమె బర్త డే కు నా చైన్ కూడా తాకట్టు పెట్టాను ..నిజం చెప్పాలంటే నా సగం జీతం ఫోన్ బుత్ లోనే గడిచిపోయింది.. ఆమెతో ఫోన్ మాట్లాడుతూనే ఉండేవాడిని ..అంతేకాదు తిట్టిందంటే మూడు రోజులు అన్నం కూడా మానేసే వాడిని “అంటూ సరదాగా తమ మధ్య జరిగిన సంభాషణలను బయటపెట్టాడు.

ఈ క్రమంలోనే శాశ్విత కూడా బ్రహ్మాజీ అంటే ఎంత ఇష్టమో ఓపెన్ గా చెప్పుకొచ్చింది . అంతేకాదు శాశ్విత మాట్లాడుతూ ..”మా పెళ్ళిలో కన్యాదానం చేసింది ఎవరో కాదు డైరెక్టర్ కృష్ణవంశీ గారు అంటూ ఎవరికి తెలియని సీక్రెట్ ను బయటపెట్టింది “. ఈ విధంగానే బ్రహ్మాజీ శాశ్విత గెస్ట్లుగా వచ్చిన ఈ ప్రోమో అందరిని ఆకట్టుకుంటుంది . మే 2న ఎపిసోడ్ ఫుల్ స్టీమింగ్ కానుంది. పెళ్లై పిల్లాడు ఉన్న ఆమెను ఎందుకు బ్రహ్మాజీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో.. పూర్తి ఎపిసోడ్ చూస్తే తెలిసిపోతుంది ..!!

Share post:

Latest