అలాంటి పనులు చేసి తన్నులు తిన్న ఎన్టీఆర్.. తారక్ లో ఇలాంటి రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందా..?

గ్లోబల్ హీరోగా పేరు సంపాదించుకున్న యంగ్ టైగర్ నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే .. నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా అడుగుపెట్టిన ఈ హీరో ప్రజెంట్ పాన్ ఇండియా హీరోగా గ్లోబల్ హీరోగా తన పేరుకి పాపులారిటి సంపాదించుకున్నాడు . రీసెంట్ గానే ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే .

ప్రజెంట్ ఎన్టీఆర్ తన కెరీర్ లోని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా ఎన్టీఆర్ 30. ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ 31 సినిమా సెట్స్ పైకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోని ఎన్టీఆర్ కి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి . ఇదే క్రమంలో ఎన్టీఆర్ కాలేజీ రోజుల్లో ఎంత అల్లరిగా ఉండేవాడు అనే విషయం వైరల్ అవుతుంది.

గుంటూరులో ఇంటర్ చదివే టైంలో ఎన్టీఆర్ చాలా సరదాగా ఉండేవాడట . అంతేకాదు కాలేజీలో క్లాసెస్ ఎగ్గొట్టి మరి..సినిమాలు చూసేవాడట. అమ్మాయిలకు బీట్ కొట్టడం.. సరదాగా ఏడిపించడం ..అమ్మాయిలను ఫన్నీగా కామెంట్ చేయడం చేసే వారట . ఎంతలా అంటే ఎన్టీఆర్ గోల తట్టుకోలేక లెక్చరర్స్ ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేసేవారట . చాలాసార్లు ఎన్టీఆర్ తన్నులు తిన్నాడట. ఇవన్నీ అందరి లైఫ్ లో ఉండేటివే కానీ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో కూడా ఇలా కాలేజీ ప్రిన్సిపల్ చేతిలో తన్నులు తిన్నాడా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . మరి కొంతమంది ఆఫ్ కోర్స్ అవన్నీ జీవితంలో మధుర జ్ఞాపకాలు అంటూ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

 

Share post:

Latest