దిల్ రాజ్ 25 ఏళ్ల కెరియర్లో షాక్ ఇచ్చిన చిత్రం ఇదేనట..!!

తెలుగు సినీ పరిశ్రమంలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు పొందారు దిల్ రాజ్.. హిట్ క్లాసులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను నిర్మిస్తూ ఉన్నారు. స్టార్స్ లేకుండా కొత్త దర్శకులకు కూడా అవకాశాలు ఇస్తూ హిట్స్ అందుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాలలో ఫ్లాపులు ఎదురైనప్పటికీ వాటిని తట్టుకొని ఇండస్ట్రీలో నిలబడే వారిలో ముందు వరుసలో ఉంటారు దిల్ రాజు. ఇటీవలే బలగం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దిల్ రాజు ఆయన నిర్మాణంలో వచ్చిన శాకుంతలం సినిమాపై అనేక అంచనాలు పెరిగిపోయాయి.

I know who is creating a controversy around Varasudu: Dil Raju
అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో పాటు కలెక్షన్లు కూడా పెద్దగా రాబట్టుకోలేకపోయింది. కేవలం ఈ చిత్రం రూ.10 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ముందు శాకుంతలం సినిమా గురించి దిల్ రాజు చాలా గొప్పగా చెప్పడంతో రిజల్ట్ తర్వాత ఆయన పైన ట్రోలింగ్ చేయడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా శాకుంతలం రిజల్ట్ పైన ఓపెన్ కావడం జరిగింది దిల్ రాజు.

Dil Raju: Shaakuntalam was a big jerk in my career
ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూలో మాట్లాడిన దిల్ రాజు శాకుంతలం సినిమా మిస్ ఫైర్ అయ్యిందని.. సోమ ,మంగళవారాలలో కలెక్షన్లు రాలేదంటే ఇక ఫిక్స్ అయిపోవాలని రియలైజేషన్ కావాలన్నారు. శాకుంతలం సినిమా తనకు పెద్ద జలక్ ఇచ్చిందని తన 25 ఏళ్ల సినీ కెరీర్లు ఇది అసలు ఊహించలేదని కూడా తెలిపారు.. ఇటీవలే బలగం దసరా సినిమాతో మంచి హిట్టు అందుకున్న దిల్ రాజు శకుంతలం సినిమా మాత్రం నిరాశపరిచిందని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని గుణశేఖర్ తెరకెక్కించగా సమంత ప్రధాన పాత్రలో నటించింది.

Share post:

Latest