బిగ్ షాకింగ్: స్టార్ హీరో రామ్ డైరెక్టర్ కు జైలు శిక్ష.. అంత తప్పు ఏం చేసాడో తెలుసా..?

లింగస్వామి ..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . బాలీవుడ్ స్టార్ డైరెక్టర్గా ఎన్నో సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లింగస్వామి కి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది . మరి ముఖ్యంగా పందెంకోడి – ఆవారా-ది వారియర్ లాంటి సినిమాలు తెరకెక్కించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న లింగస్వామి కి ..రీసెంట్గా చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలల జైలు శిక్ష పడింది .

మనకు తెలిసిందే కొన్ని సంవత్సరాల క్రితం హీరో కార్తీ – సమంత జంటగా “ఎన్నీజు నాల్ కుల్” అనే పేరుతో ఓ సినిమాని తీయాలని డైరెక్టర్ లింగు స్వామి ఆయన బ్రదర్ సుభాష్ చంద్రబోస్.. పివిపి వాళ్ల నుంచి దాదాపు 1.3 కోట్లు అప్పుగా తీసుకున్నారట. ఈ క్రమంలోనే ఆ చిత్రం కొన్ని కారణాల చేత ఆగిపోయింది . కార్యరూపం దాల్చలేదు . దీంతో తీసుకున్న డబ్బు వెనక్కి ఇవ్వాల్సిన సమయం దగ్గర పడింది.

ఈ క్రమంలో ఆ డబ్బు మొత్తాన్ని చెక్కు రూపంలో తిరిగి చెల్లించారట లింగుస్వామి . అయితే ఆ చెక్కు బౌన్స్ అవ్వడంతో పివిపి సంస్థ నేరుగా న్యాయస్థాన్ని ఆశ్రయించింది . విచారణ అనంతరం లింగస్వామి – సుభాష్ చంద్రబోస్లకు సైదాపేట్ కోర్ట్ ఆరు నెలల జైలు శిక్ష విధించింది . ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ ఇలా చెక్ బౌన్స్ కేసులో శిక్ష పడడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రామ్ హీరోగా నటించిన ది వారియర్ సినిమా డైరెక్టర్ లింగు స్వామి పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది..!!